హోమ్ /వార్తలు /national /

నేను ఒక్కడిని చాలు, బిజేపిని అధికారంలోకి తీసుకురావడానికి: రాజాసింగ్

నేను ఒక్కడిని చాలు, బిజేపిని అధికారంలోకి తీసుకురావడానికి: రాజాసింగ్

రాజా సింగ్ ఫైల్ ఫోటో

రాజా సింగ్ ఫైల్ ఫోటో

బిజేపిని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి నేను ఒక్కడిని చాలాన్నారు, గోషామహాల్ ఎమ్మేల్యే రాజాసింగ్.

  టిఆర్ఎస్ ఎంత నన్ను ఎంతగా ఓడించాలని చూసిన...గెలిచానని అన్నారు, గోషామహాల్ ఎమ్మేల్యే రాజాసింగ్. ఇంకా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ నా నియోజకవర్గంలో నాకు ఓట్లేసే చాలా మంది ఓట్లను తొలగించారనీ ఆరోపించారు. నన్ను ఓడించాడానికి మజ్లిస్, టిఆర్ఎస్ గడప, గడప తిరిగి మరీ ప్రచారం చేశారనీ.. ఎన్నో కుట్రలు చేశారనీ.. మహామహులే ఓడినా... నన్ను ఓడించాలేకపోయారన్నారు.

  నేను ఒక్కడిని చాలు..బిజేపిని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి అని అన్నారు. టిఆర్ఎస్‌కు ఓటేస్తే మజ్లిస్‌‌కు ఓటేసినట్టే అని.. నా నియోజకవర్గంలోని ప్రజలకు తెలుసనీ అందుకే..ఇంతా టిఆర్ఎస్ ప్రభంజనంలో కూడా నన్ను గెలిపించారన్నారు. అందుకు రాజాసింగ్ తన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Bjp, Raja Singh, Telangana, Telangana Election 2018, Telangana News

  ఉత్తమ కథలు