హోమ్ /వార్తలు /జాతీయం /

మే 23న పుట్టిన మగ బిడ్డ... మోదీ అని పేరు పెట్టుకున్న ముస్లీం దంపతులు

మే 23న పుట్టిన మగ బిడ్డ... మోదీ అని పేరు పెట్టుకున్న ముస్లీం దంపతులు

మీనాజ్ బేగం

మీనాజ్ బేగం

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన 23వ తేదీన పుట్టిన తమ బిడ్డకు ‘నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ’అని ప్రధాని పేరు పెట్టుకున్నారు ముస్లిం దంపతులు.

  నరేంద్ర మోదీ ... ఇప్పుడు దేశ వ్యాప్తంగా మోదీ మేనియా నడుస్తోంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోదీ తిరుగులేని విజయం సాధించారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా మోదీ పేరే వినిపిస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. గోండా ప్రాంతానికి చెందిన మీనాజ్ అనే ముస్లీం మహిళ ... ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 23న పండంటి మగబిడ్డకు జన్మించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన 23వ తేదీన పుట్టిన తమ బిడ్డకు ‘నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ’అని ప్రధాని పేరు పెట్టుకున్నారు ముస్లిం దంపతులు. ఈ విషయాన్ని దుబాయ్‌లో ఉంటున్న భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఎన్నికల్లో విజయం సాధించిన మోదీ పేరును తన కుమారుడికి పెట్టాలంటూ ఆయన చెప్పాడు.


  మోదీ దేశానికి ఎంతో మంచి చేశారని, త్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చారని, పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని, మరుగుదొడ్లు కట్టుకునేందుకు ఆర్థికసాయం చేశారని మీనాజ్ బేగం తెలిపింది. ప్రజలకు ఇంత మంచి చేసిన మోదీ పేరునే తమ బిడ్డకు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది.


  దీంతో ఆమె తన కుమారుడికి నరేంద్రమోదీ అని నామకరణం చేసింది. మోదీలాగే తన కుమారుడు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆమె తన బిడ్డను ఆశీర్వదించింది. తాజాగా విడుదలైన ఫలితల్లో మోదీ బీజేపీ పార్టీ 303 స్థానాలతో ఘన విజయం సాధించారు. ఈనెల 30న మోదీ మరోసారి భారత ప్రధానిగా ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాల్లో విజయం సాధించింది.


  First published:

  Tags: Muslim Minorities, Narendra modi, Pm modi, Uttar pradesh

  ఉత్తమ కథలు