వైసీఎం పీఎం విజయసాయిరెడ్డి త్వరలో విదేశాలకు వేళ్లే యోచనలు ఉన్నారు. అందుకే ఆయన తాజాగా సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని పిటిషన్ లో కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఏ2గా విజయ సాయి రెడ్డి ఉన్నారు. అప్పట్లో విచారణ సమయంలో సీబీఐ అధికారులు మొట్టమొదటి సారిగా.. విజయసాయి రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత బెయిల్ పై రావడం.. వైసీపీలో జాయిన్ అయ్యి.. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. మరోపక్క సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉండడంతో.. తాజాగా విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ న్యాయస్థానంలో విజయసాయి రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఎందుకంటే అప్పట్లో బెయిల్ వచ్చిన సమయంలో.. దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించండంతో తాజాగా న్యాయస్థానాన్ని అనుమతి కోరుతూ దుబాయ్, ఇండోనేషియా వెళ్లాల్సి ఉందని పిటిషన్ లో వెల్లడి చేశారు. ఇందుకోసం రెండు వారాలు అనుమతివ్వాలని, సీబీఐ న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని.. న్యాయస్థానం తెలపటంతో.. మరింత సమయంలో కావాలని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.. ఈ క్రమంలో తదుపరి విచారణ.. ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది..
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని పిటిషన్ లో కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ కోర్టు అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్లివస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. విదేశాలకు వెళ్లేందుకు కనీసం రెండు వారాల అనుమతివ్వాలని ఆయన కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, CBI, Vijayasai reddy, Vizag