MP Vijayasai Reddy: వివాదాలకు కేరాఫ్ గా మారారు ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy).. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై పూర్తి ఫోకస్ చేసిన ఆయన.. విశాఖపట్నం (Visakhapatnam) వ్యవహరాలు అన్నీ తానే చూసుకుంటున్నారు. దీంతో ఎంపీ విజయసాయి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో ల్యాండ్ సెటిల్మెంట్స్ కు పాల్పడుతున్నారని.. భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల ఈ ఆరోపణలపై ఆయనే స్వయంగా స్పందించారు కూడా.. తాజాగా విశాఖ ఎయిర్ పోర్టు (Viskhapatnam Airport) పై సంచలన కామెంట్స్ చేశారు. విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విజయనగరం జిల్లా (Vizianagaram) లోని భోగాపురం (Bhogapruam)కి తరలిస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో ఉంది. మరోవైపు వైసీపీ సర్కార్ విజయనగరం జిల్లా భోగాపురంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తోంది. ఇప్పటికే భూసేకరణతో పాటు ఇతర పనులు పూర్తయ్యాయి. ఈ విమానాశ్రయం నిర్మాణం త్వరలో పూర్తిస్ధాయిలో ప్రారంభం కానుంది. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం 2023లో పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురానికి తరలిస్తామని ప్రకటన చేశారు. విశాఖ, భోగాపురంలలో రెండు ఎయిర్ పోర్టులు ఉండడం లేదని విజయసాయి రెడ్డి వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న విశాఖ ఎయిర్ పోర్టును భోగాపురానికి తరలించడం ద్వారా విశాఖ విమానాశ్రయాన్ని కేవలం రక్షణ అవసరాలకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి ద్వారా ఉత్తరాంద్రలోని మిగిలిన రెండు జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఆలోచననే విజయసాయిరెడ్డి బయటకు చెప్పారా అనే చర్చ కొనసాగుతోంది..
ఇదీ చదవండి: ఆదర్శమంటే ఇదే.. కొడుకును ప్రభుత్వ కాలేజీలో జాయిన్ చేసిన ఉన్నతాధికారి
ఇప్పటికే విశాఖకు రాజధాని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం భోగాపురం ఎయిర్ పోర్టు ద్వారా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. మరోవైపు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసిన ప్రభుత్వం.. దీన్ని మిగిలిన జిల్లాలతో కనెక్ట్ చేసే పనిలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా విశాఖను సైతం భోగాపురం ఎయిర్ పోర్టుకు కనెక్ట్ చేసేలా రహదారి పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: కేవలం 1600లకే అద్భుతమైన స్మార్ట్ ఫోన్.. పార్శిల్ ఓపెన్ చేస్తే షాక్
అదే సమయంలో విశాఖలో మురికివాడల్ని సైతం అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సాయిరెడ్డి వెల్లడించారు. విశాఖ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.. రాజధాని పేరు చెప్పి ఇప్పటికే విశాఖను దోచేస్తున్నారని.. ఇప్పుడు విమానాశ్రయాన్ని కూడా లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airport, Andhra Pradesh, AP News, Vijayasai reddy, Visakhapatnam