హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Andhra Pradesh: ఏపీలో మహిళకు గుడ్ న్యూస్: మూడున్నర లక్షల మందికి ప్రసూతి ప్రయోజనాలు: ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు కేంద్రం సమాధానం

Andhra Pradesh: ఏపీలో మహిళకు గుడ్ న్యూస్: మూడున్నర లక్షల మందికి ప్రసూతి ప్రయోజనాలు: ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు కేంద్రం సమాధానం

రాజ్యసభ సభ్యులు పరిమల్ నత్వానీ

రాజ్యసభ సభ్యులు పరిమల్ నత్వానీ

ఏపీ నుంచి రాజ్య సభ సభ్యుడిగా ఎంపిక అయిన దగ్గర  నుంచి రాష్ట్ర ప్రయోజనాలపై పరిమల్ నత్వానీ కేంద్రాన్ని పలు సందర్భాల్లో ప్రశ్నిస్తూనే ఉన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల ప్రయోజనాలు రాష్ట్రానికి చేరుతున్నాయా లేదా అన్నాదానిపై ఆరా తీస్తూనే ఉన్నారు.  

ఇంకా చదవండి ...

ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన పరిమళ్ నత్వానీ రాష్ట్ర ప్రయోజాలపై సభలో పోరాడుతూనే ఉన్నారు. ఏపీకి రావాల్సిన పథకాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. ఆ ప్రయోజనాలు లబ్ధి దారులకు అందేలా చేస్తున్నారు. ఇటీవల రైల్వే ప్రాజెక్టులపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఆయన.. తాజాగా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ద్వారా ఏపీకి అందున్న లబ్ధిపై కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సమాధానం చెప్పారు. 2020 క్యా లెండర్ సంవత్సరంలో ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద ఏపీలోని 3 లక్షల 70 వేల 456 మెంది మహిళలకు ప్రయోజనం కల్పించినట్టు చెప్పారు.

మంత్రి ప్రకటన ప్రకారం, ప్రభుత్వం పీఎంఎంవైవైని అమలు చేస్తోందని.. దీనిలో భాగంగా నగదు ప్రోత్సాహకపరంగా వేతన నష్టానికి పాక్షిక పరిహారం అందిస్తున్నట్టు తెలిసిందది. దీంతో మొదటి బిడ్డ ప్రసవానికి ముందు తరువాత స్త్రీ తగిన విశ్రాంతి తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలలోనూ, పాలిచ్చే తల్లులలోనూ మంచి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ నగదు ప్రోత్సాహకాలను అందించామని చెప్పారు. 2020లో దేశ వ్యాప్తంగా ప్రధాన్ మంత్రి మాతృత్వ వందన యోజన కింద మొత్తం మహిళా లబ్దిదారుల సంఖ్య గురించి, అలాగే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన ప్రశ్నించారు.

2017లో ప్రసూతి ప్రయోజన చట్టం, 1961లో ప్రభుత్వ సవరణలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. కీలకమైన సరవణల్లో చెల్లింపు ప్రసూతి సెలవులను 12 వారాల నుండి 26 వారాలకు పెంచారు. చెల్లించిన ప్రసూతి సెలవులను 12 వారాల పొడిగించినట్టు తెలుస్తోంది. ఒక మహిళ మాతృ మూర్తిగా మారడం, లేదా దత్తత తీసుకోవడం అలాగే 50 లేదా అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న సంస్థకు సంబంధించి తప్పని సరి నిబంధనలు పాఠించాలని ఇందులో ఉంది అన్నారు. ఇందులో నాలుగు కేటగిరీలుగా చేశారు. ఒక స్త్రీకి కేటాయించిన పని స్వహభావాన్ని బట్టి అటువంటి కాలానికి ప్రసూతి ప్రయోజనం పొందిన తరువాత వర్క్ వర్క్ ఫ్రం హోంకు యాజమాన్యం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇద్దరికీ ఆంగీకరం కుదిరితే ఇంటి దగ్గర నుంచి పని చేయొచ్చని నిబంధనలు చెబుతున్నాయి. ప్రతి మహిళా తాను కంపెనీలో అడుగుపెడుతున్నప్పుడే ఈ నిబంధనల గురించి తెలుసుకుని.. తమ హక్కుగా వాటిని పొందుతాని నమ్మకం వచ్చిన తరువాతే సంతకం చేయాలని తెలిపారు.

ఏపీ నుంచి రాజ్య సభ సభ్యుడిగా ఎంపిక అయిన దగ్గర  నుంచి పరిమళ్ నత్వానీ రాష్ట్ర ప్రయోజనాలపై  కేంద్రాన్ని పలు సందర్భాల్లో ప్రశ్నిస్తూనే ఉన్నారు.  కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా ఎంత? ఇప్పటి వరకు ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఎంతమంది? ఇప్పటి వరకు విడుదలైన నిధులు ఎన్ని.. ఇంకా రావాల్సిన నిధులు ఎన్ని అని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా ఆయా పథకాలు లబ్ధి దారులకు చేరుతున్నాయా లేదా అన్నది ఏపీ ప్రభుత్వం ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎంపీ పరిమళ్ నత్వానీ

First published:

Tags: Andhra Pradesh, AP News, National, Parimal Nathwani, Pm modi, Rajya Sabha, Smriti Irani

ఉత్తమ కథలు