హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPoll: దుబ్బాకలో ఓటమి భయంతో కేసీఆర్ అక్కడికి పోయిండు.. ఎంపీ అర్వింద్ సంచలన వాఖ్యలు

Dubbaka ByPoll: దుబ్బాకలో ఓటమి భయంతో కేసీఆర్ అక్కడికి పోయిండు.. ఎంపీ అర్వింద్ సంచలన వాఖ్యలు

ధర్మపురి అర్వింద్(ఫైల్ ఫొటో)

ధర్మపురి అర్వింద్(ఫైల్ ఫొటో)

దుబ్బాకలో ఎన్నికల్లో ఓడిపోబోతున్నామన్న భయంతోనే సీఎం కేసీఆర్ జనగామకు వెళ్లి రైతు వేధికలను ప్రారంభించాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ 2014 నుంచి మంత్రిగా ఉండి.. ఇన్నాళ్లుగా ఏం చేశాడని ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...

  దుబ్బాకలో ఎన్నికల్లో ఓడిపోబోతున్నామన్న భయంతోనే సీఎం కేసీఆర్ జనగామకు వెళ్లి రైతు వేధికలను ప్రారంభించాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్  విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఏడాదికి 365 రోజులకు గాను.. 360 రోజులు ఇంటిలోనే ఉంటూ బయటకు రాడని తీవ్ర వాఖ్యలు చేశాడు. దుబ్బాక ఎన్నికల లాంటి ప్రతికూలమైన వాతావరణం ఎదురైనప్పుడే బయటకు వస్తాడన్నారు. హైదరాబాద్ లో వరదల విషయంపై ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ 2014 నుంచి మంత్రిగా ఉండి.. ఇన్నేళ్లుగా ఏం చేశాడని ప్రశ్నించారు. ఇలాంటి విపత్తులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రధాని నరేంద్ర మోదీని చూసి నేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఓల్డ్ సిటీలో ఓవైసీని చూస్తే కేసీఆర్ కు భయం అని విమర్శించారు.

  ఓవైసీకి చెంచాగారి చేయడాన్ని అడ్మినిస్ట్రేషన్ అని అనిపించుకోదని తీవ్ర వాఖ్యలు చేశారు. పాతబస్తీలో పాన్ దుకాణం తొలగించాలన్నా.. కేటీఆర్ ప్యాంట్ తడుస్తుందని అర్వింద్ వంగ్యంగా వాఖ్యానించారు. దేశంలో రాష్ట్రపతి తర్వాత ఎక్కువ జీతం తీసుకునేది సీఎం కేసీఆర్ మాత్రమే అని విమర్శించారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఏడు చెరువుల నీళ్లు తాగించామని.. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఈజీగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

  సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఓడిపోతాడన్నారు. ఆయన అహంకార పూరితమైన వైఖరే ఇందుకు కారణం కాబోతుందన్నారు. బీజేపీ కార్యకర్తలపై అనుచిత వాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని.. కేటీఆర్ ను ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత తదితరులు తాము వేతనాలు తీసుకునేది ప్రజల సొమ్ముతోనేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: CM KCR, Dharmapuri aravind, Dubbaka By Elections 2020, KTR, Telangana bjp

  ఉత్తమ కథలు