హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPoll: వారికి పంచడం కోసం హరీష్ రావు వసూళ్లు.. బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలన వాఖ్యలు

Dubbaka ByPoll: వారికి పంచడం కోసం హరీష్ రావు వసూళ్లు.. బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలన వాఖ్యలు

ఎంపీ అర్వింద్ (ఫైల్)

ఎంపీ అర్వింద్ (ఫైల్)

Dubbaka ByPoll: హరీష్ రావు ఉదయం లేచిన వెంటనే కలెక్షన్లు చేసి.. సాయంత్రం కాగానే నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవితకు, ఎంపీ సంతోష్ కుమార్ కు పంపకాలు చేస్తారంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. దుబ్బాక ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని నల్లికుట్ల కుటుంబంగా భావిస్తున్నారన్నారు.

ఇంకా చదవండి ...

  ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయం వేడెక్కుతోంది. వివిధ పార్టీల నేతలు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తమ సిట్టింగ్ స్థానంలో భారీ మెజార్టీతో గెలిచి మరో సారి తమ సత్తా చాటాలని అధికార టీఆర్ఎస్ నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తమేనన్న వాతావరణాన్ని తీసుకురావాలని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో శుక్రవారం బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ రోడ్ షోలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావుపై తీవ్ర వాఖ్యలు చేశారు.

  హరీష్ రావు ఉదయం లేచిన వెంటనే కలెక్షన్లు చేసి.. సాయంత్రం కాగానే నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవితకు, ఎంపీ సంతోష్ కుమార్ కు పంపకాలు చేస్తారంటూ ఆరోపించారు. దుబ్బాక ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని నల్లికుట్ల కుటుంబంగా భావిస్తున్నారన్నారు. రైతులు తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి టీఆర్ఎస్ పార్టీని వైకుంఠదామానికి పంపించాలని అర్వింద్ పిలుపునిచ్చారు.

  దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి సీఎం పీఠం ఇచ్చినట్టేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోయినా కారు పార్టీ గెలిస్తే కేసీఆర్ కాలర్ ఎగరేస్తారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తెచ్చినా ప్రజలు పట్టించుకోపోతే రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపడలేరని జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.

  ‘దుబ్బాక లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం బాధాకరం. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి మళ్ళీ గెలిస్తే రాష్ట్ర ప్రజలకు శాపం కానుంది. దుబ్బాక లో కాంగ్రెస్-బీజేపీ-టీఆర్ఎస్ మధ్యే పోటీ. రూలింగ్ పార్టీ కావడం వల్ల టీఆర్ఎస్ కు చాలా అనుకూలతలు ఉంటాయి. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కు పెద్దకొడుకు పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల పోలింగ్- ఫలితాలు రాకముందే టీఆర్ఎస్ గెలిచినట్లు ప్రకటన చేస్తున్నారు. దుబ్బాక లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అయింది.. మెజారిటీ మాత్రమే అంటూ మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు. కలెక్టర్, పోలీసులు టీఆర్ఎస్‌కు ప్రచారం చేస్తున్నారు.’ అని జగ్గారెడ్డి అన్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Dharmapuri Arvind, Dubbaka By Elections 2020, Harish Rao

  ఉత్తమ కథలు