కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikharjuna Kharge) ఇటీవల ప్రధాని మోదీని (Pm Modi) రావణుడితో పోలుస్తూ విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలపై నేడు ప్రధాని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. గౌరవనీయులైన ఖర్గే (Mallikharjuna Kharge) నన్ను రావణునితో పోల్చారు. అసలు రాముని ఉనికి ఏనాడూ నమ్మని ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాత్రం రామాయణం నుండి రావణుడిని తీసుకొచ్చారని, ఇలాంటి కఠిన పదాలు వాడిన వారు కనీసం పశ్చాతాపం కూడా పడడం లేదన్నారు. కాగా ఇవాళ గుజరాత్ లో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక రెండో దశ ఎన్నికలు డిసెంబర్ 5న జరగనున్నాయి. ఈ క్రమంలో కలోల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ (Pm Modi) ఈ వ్యాఖ్యలు చేశారు.
నన్ను 2014లో ఢిల్లీకి పంపినప్పుడు 2 మొబైల్ ఫ్యాక్టరీలు ఉండేవని కానీ ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య 200కు పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెవులు విప్పి వినాలని, ప్రజాస్వామ్యంపై విశ్వాసం, అవిశ్వాసం ఉండాలన్నారు. కాంగ్రెస్ నాయకులు నన్ను తిట్టడంలో పోటీ పడుతున్నారని అన్నారు. ఖర్గే (Mallikharjuna Kharge) 100 తలల రావణుడు అంటే మరొకరు మరోలా తిడుతున్నారన్నారు. నన్ను ఎంత తిడితే కమలం అంతలా బలోపేతం అవుతుందని ప్రధాని మోదీ (Pm Modi) ఉద్గాటించారు.
ఖర్గే సంచలన కామెంట్స్..
కాగా ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోదీపై విమర్శలు కురిపించారు. ప్రధాని మోడీని రావణునితో పోల్చారు. ఎన్నికలు ఏదైనా ప్రధాని మోదీ మొఖం చూసి ఓటేయాలని అంటున్నారు. మోదీ ఏమైనా 100 తలల రావణాసురుడా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ తన స్థాయిని మరిచిపోయి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికలు ఇలా అన్ని ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రచారం చేయడంపై ఖర్గే విమర్శలు గుప్పించారు.
ఈ వ్యాఖ్యలతో మొదలైన వివాదం..
మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు బీజేపీ , కాంగ్రెస్ మధ్య మాటల యుద్దానికి తెర లేపింది. ఓ వైపు గుజరాత్ మొదటి విడత ఎన్నికలు జరుగుతుండగానే మరోవైపు రెండో విడత ప్రచారంలో వరుస విమర్శలు చేసుకుంటున్నారు. మరి ప్రస్తుతం వార్ ఖర్గే (Mallikharjuna Kharge) వర్సెస్ మోదీగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Gujarat Assembly Elections 2022, Mallikarjun Kharge, PM Narendra Modi