హోమ్ /వార్తలు /జాతీయం /

మోదీ వెంట హెలికాప్టర్లో అనుమానాస్పద ట్రంకు పెట్టె...? ఏముందో చెప్పాలంటున్న విపక్షం...

మోదీ వెంట హెలికాప్టర్లో అనుమానాస్పద ట్రంకు పెట్టె...? ఏముందో చెప్పాలంటున్న విపక్షం...

నరేంద్ర మోదీ (File)

నరేంద్ర మోదీ (File)

Modi Black Box Mystery | ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని చిత్రదుర్గలో ఎన్నికల ప్రచార సభకు హెలికాప్టర్ లో వచ్చారు. అయితే తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ఒక నల్లటి ట్రంకు పెట్టె వెంట పెట్టుకొని వచ్చారని, అనంతరం ఆ ట్రంకు పెట్టెను ముగ్గురు వ్యక్తులు ఒక ప్రైవేటు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇంకా చదవండి ...

    ప్రధాని మోదీ తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఒక నల్లటి ట్రంకు పెట్టె వెంట తీసుకొని రావడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఎలక్షన్ కమీషన్‌కు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని చిత్రదుర్గలో ఎన్నికల ప్రచార సభకు హెలికాప్టర్ లో వచ్చారు. అయితే తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ఒక నల్లటి ట్రంకు పెట్టె వెంట పెట్టుకొని వచ్చారని, అనంతరం ఆ ట్రంకు పెట్టెను ముగ్గురు వ్యక్తులు ఒక ప్రైవేటు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీని వెనుక కుట్ర ఉందని, ట్రంకు పెట్టెలో ఏమున్నాయో ఎలక్షన్ కమీషన్‌కు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.


    నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే హెలికాప్టర్ వెంట మరో రెండు హెలికాప్టర్ లు ఎస్కార్టింగ్ చేస్తుంటాయి. అంతే కాదు ప్రధాని భద్రత పూర్తిగా ఎస్‌పీజీ కవర్ ఉంటుంది. అయితే ప్రధాని మోదీ హెలికాప్టర్ లో వచ్చిన నల్ల రంగు ట్రంకు పెట్టె మాత్రం ప్రధాని కాన్వాయ్ తో సంబంధం లేకుండా ప్రైవేటు వాహనంలో తరలివెళ్లిపోవడంపై కాంగ్రెస్ పార్టీనేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఎలక్షన్ కమీషన్ అన్ని పార్టీల నాయకుల వాహనాలను తనిఖీలు చేస్తోందని, మరి ప్రధాని తన వెంట తెచ్చుకున్న నల్ల రంగు ట్రంకుపెట్టెలో ఏమున్నాయో తనిఖీ చేయాలని డిమాండ్ చేసింది.

    First published:

    Tags: Chitradurga S10p18, Congress, Karnataka Lok Sabha Elections 2019, Narendra modi, Pm modi

    ఉత్తమ కథలు