ముంబై(Mumbai)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) నివాసం ఎదుట హనుమాన్ చాలిసా (Hanuman Chalisa) పఠిస్తామని అమరావతి ఎంపీ నవనీత్ రానా (Navneet Kaur Rana), ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానా (Ravi Rana) స్పష్టం చేయడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ రేగుతోంది. వీరిద్దరి ప్రకటన తర్వాత శివసేన (Shiv Sena) కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు సీఎం ఇంటి ముందు పఠించడం కాదు.. మేమే మీ ఇంటికి వస్తామని మండిపడ్డారు. చెప్పినట్లుగానే ఇవాళ ఎంపీ నవనీత్ నివాసానికి వెళ్లి.. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
#WATCH Shiv Sena workers protest outside the residence of Amravati MP Navneet Rana in Mumbai as the MP plans to chant Hanuman Chalisa along with her husband MLA Ravi Rana outside 'Matoshree' the residence of #Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/OR7CQQpWlk
తన ఇంటి ముందు శివసేన కార్యకర్తలు ఆందోళన చేయడంపై ఎంపీ నవనీత్ రానా మండిపడ్డారు. తమపై దాడి చేయాలని సీఎం ఉద్ధవ్ థాక్రేనే వారిని పురమాయించారని విమర్శించారు. మీరేమైనా చేయండి.. నేను మాతోశ్రీకి వెళ్లి హనుమాన్ చాలిసాను పఠిస్తానని తెగేసి చెప్పారు నవనీత్ రానా. ప్రజలు జైల్లో ఎలా పెట్టాలో.. అదొక్కటే సీఎంకు తెలుసని విరుచుకుపడ్డారు. మరోవైపు నవనీత్ దంపతులపై శివసేన కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ముంబైలో శాంతి భద్రతలను వారు ఛాలెంజ్ చేస్తున్నారని దుమ్మత్తిపోస్తున్నారు. వారికి ఇంత ధైర్యం లేదని.. ఎవరో చెబితేనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. మాతోశ్రీని ఎలా కాపాడుకోవాలో శివసైనికులకు బాగా తెలుసని ఆ పార్టీ నేత అనిల్ దేశాయ్ చెప్పారు.
Mumbai | They (MLA Ravi Rana and MP Navneet Rana) have challenged the law and order situation. They were prompted to do this by someone. Shiv Sena workers are here to protect 'Matoshree'. Police are taking care of the situation: Shiv Sena leader Anil Desai outside 'Matoshree' pic.twitter.com/AiqFVbxnCZ
నవనీత్ కౌర్ రానా రాజకీయాల్లోకి రాకముందు తెలుగుతో పాటు పలు భాషల్లో హీరోయిన్గా నటించారు. శీను వాసంతి లక్ష్మి, శత్రువు, జగపతి, గుడ్ బాయ్, స్టైల్, రూమ్ మేట్స్, రణం, మహారథి, యమదొంగ, జాబిలమ్మ వంటి సినిమాల్లో కనిపించారు. ఆమె భర్త రవి రానా మూడుసార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌కు సన్నిహితులు. నవనీత్ 2019లో మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో ఆమె విజయం సాధించారు. ఐతే ఇప్పుడు వీరిద్దరు హిందూత్వ అజెండాను ఎత్తుకొని.. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా సీఎం ఉద్ధవ్ థాక్రేను నవనీత్ రానా టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చాక.. ఉద్ధవ్ థాక్రే హిందూత్వను మరిచిపోయారని విమర్శిస్తున్నారు. ఆయన వేరే మార్గంలో వెళ్తూ మహారాష్ట్రను ధ్వంసం చేస్తున్నారని మండిపడుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకే మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా చదువుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మాతో శ్రీ ముందు పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. కౌంటర్‌గా శివసేన కార్యకర్తలు భారీగా తరలి వెళ్లి.. ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబైలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.