హోమ్ /వార్తలు /national /

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. జనసేనపై రాపాక కీలక వ్యాఖ్యలు

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. జనసేనపై రాపాక కీలక వ్యాఖ్యలు

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)

జనసేన పార్టీకి దూరంగా లేనని.. దగ్గరగా కూడా లేనని స్పష్టం చేశారు. ఈ మధ్య పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలవలేదని తెలిపారు రాపాక.

  ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని తన మద్దతు ఉంటుందని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి స్పష్టం చేశారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటే తీరప్రాంతాల్లోని గ్రామాలు, వెనకబడిన జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే ఖచ్చితంగా మద్దతిస్తానని ఇంతకు ముందే చెప్పానని ఆయన గుర్తు చేశారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన.. జనసేన పార్టీపై తన అభిప్రాయాన్ని చెప్పారు. జనసేన పార్టీకి దూరంగా లేనని.. దగ్గరగా కూడా లేనని స్పష్టం చేశారు. ఈ మధ్య పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలవలేదని తెలిపారు.

  2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ గెలిచారు. ఐతే కొన్ని నెలల తర్వాత జనసేన పార్టీకి ఆయన దూరంగా ఉంటున్నారు. జగన్‌కు పాలాభిషేకాలు చేయడంతో పాటు అసెంబ్లీలోనూ వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సొంత జిల్లాలో జరిగిన జనసేన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదు. పార్టీ నిర్వహించిన ఈ ఈవెంట్‌కూ హాజరుకాలేదు. దాంతో పవన్ కల్యాణ్ కూడా ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలో రాపాక వరప్రసాద్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే జగన్‌కు మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఈయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: AP News, Janasena party, Rapaka varaprasad, Tirumala news

  ఉత్తమ కథలు