హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Tamilnadu Election Result: గెలిచి నిలిచిన స్టాలిన్.. ఓడి గెలిచిన పళనిస్వామి.. అదెలా అంటే..

Tamilnadu Election Result: గెలిచి నిలిచిన స్టాలిన్.. ఓడి గెలిచిన పళనిస్వామి.. అదెలా అంటే..

ఉదయనిధితో స్టాలిన్, పళనిస్వామి

ఉదయనిధితో స్టాలిన్, పళనిస్వామి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడినట్లుగా వార్ వన్‌సైడ్ కాలేదు. డీఎంకే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తమిళనాట ఓటర్ నాడిపై ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒకే రకమైన అంచనాను వెల్లడించాయి. రాష్ట్రంలో డీఎంకే కూటమి క్లీన్ స్విప్ చేస్తుందని P-MARQ, REPUBLIC CNX, టూడేస్ చాణక్య, యాక్సిస్-మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 234 స్థానాల్లో డీఎంకే కూటమి మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి.

ఇంకా చదవండి ...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడినట్లుగా వార్ వన్‌సైడ్ కాలేదు. డీఎంకే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తమిళనాట ఓటర్ నాడిపై ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒకే రకమైన అంచనాను వెల్లడించాయి. రాష్ట్రంలో డీఎంకే కూటమి క్లీన్ స్విప్ చేస్తుందని P-MARQ, REPUBLIC CNX, టూడేస్ చాణక్య, యాక్సిస్-మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 234 స్థానాల్లో డీఎంకే కూటమి మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి 50 వరకు స్థానాలను సొంతం చేసుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ.. తాజాగా వెల్లడైన ఫలితాల ట్రెండ్‌ను ఒక్కసారి పరిశీలిస్తే.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినంత అనూహ్య విజయం డీఎంకే సొంతం కాలేదు. అంతటి ఘోర ఓటమిని కూడా అన్నాడీఎంకే చవిచూడలేదు. ప్రస్తుతం ఈ సమయానికి తమిళనాడులో ఇప్పటివరకూ వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో డీఎంకే 151, అన్నాడీఎంకే 82, కమల్ పార్టీ మక్కల్ నీది మయం ఒక్క స్థానంలో ముందంజలో ఉన్నాయి. దినకరన్ వెనుకంజలో ఉన్నారు. ఈ ఫలితాల సరళిని గమనిస్తే.. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ఈసారి ఎన్నికలను ఎదుర్కొన్న అన్నాడీఎంకే చెప్పుకోదగ్గ స్థానాలనే కైవసం చేసుకుంది. పళనిస్వామికి ఒక సమర్థ నేతగానే ఓటర్లలో గుర్తింపు దక్కింది. తమిళనాడులో జయలలిత అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి.. శశికళ జైలుకు వెళ్లాల్సి రావడం వంటి పరిణామాలు పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేశాయి. పళనిస్వామి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో పన్నీరుసెల్వం వర్గం భగ్గుమంది.

అన్నాడీఎంకే ప్రభుత్వంలో వర్గపోరు మొదలైందని.. పళనిస్వామి సీఎంగా నెల రోజులు కూడా కొనసాగే పరిస్థితి లేదని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే.. చాకచక్యంగా అన్నాడీఎంకేలో నెలకొన్న వర్గపోరుకు పళనిస్వామి చెక్ పెట్టారు. పన్నీరుసెల్వంను పక్కనే ఉంచుకుని ప్రభుత్వాన్ని నడిపారు. ఎలాగోలా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న పళనిస్వామికి 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఊహించని షాకిచ్చాయి. తమిళనాడులోని 39 పార్లమెంట్ స్థానాలకు అన్నాడీఎంకే అభ్యర్థులు పోటీ చేయగా ఆ పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఈ ఫలితాలు పళనిస్వామిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. అయినప్పటికీ ధైర్యం కోల్పోని పళనిస్వామి 2021 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. 2019 ఎన్నికల సమయంలో స్టాలిన్‌కు వ్యూహకర్తగా వ్యవహరించిన సునీల్‌ను ఈపీఎస్ అన్నాడీఎంకేకు వ్యూహకర్తగా నియమించుకున్నారు. డీఎంకే తరపున ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో ముగిసేవరకూ డీఎంకేకు అధికారం రావడం కష్టమేననే రీతిలో సునీల్ వ్యూహాలు రచించారు. అన్నాడీఎంకే తిరిగి అధికారం దక్కించుకుంటుందన్న సంకేతాలను బలంగా పంపారు. అయితే.. అధికారం దక్కనప్పటికీ చెప్పుకోదగ్గ స్థానాలనే డీఎంకే, బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. డీఎంకేకు గంపగుత్తగా అధికారం దక్కలేదు.

బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడం వల్ల అధికారం దక్కించుకునే అవకాశాలను అన్నాడీఎంకే దూరం చేసుకుందనే వాదన కూడా వినిపిస్తోంది. కొందరు అన్నాడీఎంకే నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులున్నాయి. తమిళనాడులో బీజేపీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందని ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని, బీజేపీతో అన్నాడీఎంకే బలవంతంగా పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని పళనిస్వామి సొంత జిల్లా సాలెంకు చెందిన ఒక నేత అభిప్రాయపడ్డారు. అయితే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం పళనిస్వామికి దక్కకపోయినప్పటికీ డీఎంకే జోరుకు బ్రేకులేసి ఆ పార్టీ ఏకపక్షంగా సీట్లు గెలుచుకునేలా అవకాశాలను దెబ్బతీయగలిగారు. తద్వారా తన వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకోగలిగారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా అన్నాడీఎంకే నిలబడగలిగింది. ఈ ప్రతిపక్షానికి పళనిస్వామి సారథ్యం వహించనున్నారు.

ఒకవేళ.. పళనిస్వామి నేతృత్వంలో ఎన్నికల బరిలోకి నిలిచిన అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలై ఉంటే.. ఆ పార్టీ నేతలు, క్యాడర్ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీకి తరలే పరిస్థితి ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో అన్నాడీఎంకేను పళనిస్వామి కాపాడుకోగలిగారని చెబుతున్నారు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కొందరు రాజకీయ విశ్లేషకులు స్టాలిన్ గెలిచి నిలిచారని.. పళనిస్వామి ఓడి గెలిచారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రకారం.. స్టాలిన్‌తో పాటు అన్నాడీఎంకే ఓడినా పళనిస్వామి కూడా హీరోనే అని చెప్పుకొస్తున్నారు. డీఎంకే స్పష్టమైన మెజార్టీ కనబర్చడంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.

డీపీ సతీష్, న్యూస్18

First published:

Tags: 5 State Elections, AIADMK, DMK, MK Stalin, Palanisami, Tamilnadu

ఉత్తమ కథలు