హోమ్ /వార్తలు /national /

Minster Kodali Nani: సీఎం జగన్ మేక కాదు.. పులి.. సోనియాను ఎదురించిన మగాడు ! చంద్రబాబు, పవన్ లపై తిట్ల దండకం..

Minster Kodali Nani: సీఎం జగన్ మేక కాదు.. పులి.. సోనియాను ఎదురించిన మగాడు ! చంద్రబాబు, పవన్ లపై తిట్ల దండకం..

చంద్రబాబు, పవన్ పై కొడాలి ఫైర్

చంద్రబాబు, పవన్ పై కొడాలి ఫైర్

Minster Kodali Nani No: ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా పెట్రోల్ ధరల చుట్టూనే తిరుగుతోంది. విపక్షలన్నీ ప్రభుత్వం తీరుపై ఆందోళనలు చేస్తున్నాయి. విపక్షాల తీరుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ.. బుద్ధి పెరగలేదన్నారు.. ఎక్కడైనా సీఎం పెట్రోల్ రేట్లను తగ్గిస్తారా అంటూ ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...

Minster Kodali Nani No: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పెట్రో మంటల రాజకీయంగా సెగలు కక్కుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పెట్రోల్ రేట్లు తగ్గించినా.. ఏపీ ప్రభుత్వం  ( AP Government)ఎందుకు తగ్గించడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరల (Petrol diesel rates )పై వ్యాట్ తగ్గించాలంటూ తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. దీంతో చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) తీరుపై మంత్రి కొడాలి నాని (Minster Kodali Nani) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పెట్రోల్, డీజిల్‌పై 2 రూపాయల సర్‌ఛార్జీ విధించినట్లు కొడాలి నాని గుర్తుచేశారు. ఎక్కడైనా పెట్రోల్ ధరలను ముఖ్యమంత్రి తగ్గిస్తారా అని ప్రశ్నించారు.

టీడీపీకి ఎన్నిసార్లు ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబుకు సిగ్గురావడం లేదన్నారు. మరోవైపు బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీని ఓటర్లు పెట్రోల్ పోసి తగులపెట్టారని, ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు. మరోవైపు స్టీల్‌ప్లాంట్‌పై ఏపీ ప్రభుత్వానికి వారం రోజులు డెడ్‌లైన్ పెట్టిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పైనా మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు.

ఇదీ చదవండి : నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో నాలుగు రోజులు భారీ వానాలు.. ఎక్కడంటే?

అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లడానికి జగన్‌కు పవన్ డెడ్‌లైన్ పెట్టాడని.. వారం కాదు ఏడేళ్లు డెడ్‌లైన్ పెట్టినా పవన్‌ను జగన్ ఢిల్లీకి తీసుకువెళ్లరని స్పష్టం చేశారు. కావాలంటే పవన్‌కు చెందిన పార్టీలోని నేతలను పంపిస్తే తానే టిక్కెట్లు బుక్ చేయించి ఢిల్లీకి పంపిస్తానని.. దాని కోసం డెడ్‌లైన్లు పెట్టాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు.

ఇదీ చదవండి : నామినేషన్ల ఉప సంహరణ రచ్చ రచ్చ.. ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు.. ఆందోళనలు

స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ప్రశ్నించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని.. తనతో పొత్తు పెట్టుకున్న మోదీని అంటూ చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్‌కు ప్రధాని మోదీ, అమిత్ షా ఢిల్లీలో అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు కాబట్టే జగన్‌ను తీసుకువెళ్లాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలను అడ్డం పెట్టుకుని అఖిలపక్షం పేరుతో ఢిల్లీకి తీసుకువెళ్లాలంటూ సిగ్గులేకుండా అడుగుతున్నారని కొడాలి నాని ఆరోపించారు.

ఇదీ చదవండి : కుదరదని తేల్చేసిన ప్రభుత్వం.. నేడు ఆందోళనలకు చంద్రబాబు పిలుపు

ఇక బీజేపీపైనా ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు మంత్రి నాని. బీజేపీ బెదిరింపులకు బయపడడానికి ఇక్కడ ఉన్న సీఎం జగన్ మేక కాదు.. పులి అని అన్నారు. బీజేపీ ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. అధికారంలో ఉండగానే సోనియాగాంధీ ని ఎదిరించి బయటకి వచ్చిన మగాడు జగన్ అని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ, టీడీపీ లను ప్రజలు తగులబెడతారని స్పష్టం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Chandrababu Naidu, Kodali Nani, Pawan kalyan

ఉత్తమ కథలు