సీపీఐ నేత నారాయణపై(CPI Narayana) తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్(Puvvada Ajay Kumar) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ రోజున తన కాన్వాయ్‌కు అడ్డుపడి దాడికి దిగిన బీజేపీకి నారాయణ వంతపాడడం ఏమిటని ప్రశ్నించారు. నారాయణ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బీజేపీకి చెందిన 200 మంది కార్యకర్తలు తనపై దాడికి పాల్పడి హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో తాను సురక్షితంగా బయటపడ్డానన్నారు. ఈ విషయం తెలసుకోకుండా తనను మంతివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నారాయణ వ్యాఖ్యానించారని మండిపడ్డారు. తన తండ్రి నుంచి సాయం పొందిన నారాయణ.. ఆయననే మోసం చేశారని ఆరోపించారు. తన తండ్రికి పదవులు రాకుండా నారాయణ పలుమార్లు అడ్డుకున్నాడని విమర్శించారు.
ఇంకా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. "CPI చికెన్ నారాయనా. CPI చానల్ 99 టీవీని అమ్ముకున్నావ్. పార్టీ ని సున్నాకి తెచ్చావ్, నెను ఏ పార్టీలో ఉన్నా ప్రజలు నన్ను గెలిపించారు. నువ్వెప్పుడైనా ప్రజలనుండి గెలిచావా ? నీ జాతకం మొత్తం నేను నోరు విప్పితే బజారు పాలైతవ్. మా నాన్న దగ్గర నుంచి నువ్వు సాయం పొంది ఆయనకే దెబ్బేసావ్. 2006లో పార్టీలో మా నాన్నకు మెజరిటీ ఉన్నా రాజ్యసభకు పోకుండా అడ్డుకున్నావ్. 2009లో మహా కూటమి ఖమ్మం ఎంపీ అభర్ధిగా మా నాన్నను నిర్ణయిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర 4 కొట్ల రూపాయలు తీసుకొని దాన్ని అమ్ముకున్నావ్. 2011 లొ మా నాన్న మళ్లీ ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకున్నావ్. నీకు మా కుటుంబంతో సమస్య , నాతొ కాదు. నాకు తెలుసు. నీ నీచ రాజకీయ బతుకుని ఎండగడతా. నువ్వు 2018 ఎన్నికల్లొ లొ ఖమ్మం వచ్చి నన్ను ఒడిచమన్నావు. కానీ ప్రజలు నన్ను గెలిపించారు. నాకు మంత్రి పదవి KCR ఇస్తే నువ్వేందుకు వణికిపోతున్నావ్.. ఖబడ్దార్. నోరు అదుపులొ పెట్టుకో, లెకపొతె మా KCR వదిలెసిన నీ చెవ్వు తెగుద్ది బిడ్డా"అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
Puvvada Ajay: మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు, బీజేపీపై నోరు జారిన మంత్రి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూకట్పల్లి ఫోరం షాపింగ్ మాల్ వద్ద మంత్రి కారు మీద దాడి జరిగింది. మంత్రి పువ్వాడ అజయ్ తన కారులో డబ్బులు పెట్టుకుని వచ్చారనే అనుమానంతో బీజేపీ నేతలు దానిపై దాడికి దిగారు. కారు బ్యానెట్ మీద ఓ యువకుడు ఎగిరి కూర్చున్నాడు. మరో యువకుడు కారు వెంట పడ్డాడు. ఈ విషయం పెద్ద దుమారం రేపింది. బీజేపీ నేతలు తన మీద పథకం ప్రకారం హత్యకు కుట్ర పన్నారని అజయ్ ఆరోపించారు. కారులో ఓ వ్యక్తి బానెట్ మీద పడుకుని ఉండగా, మరో వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్న సమయంలో కారును వేగంగా తీసుకుని వెళ్లడాన్ని నారాయణ తప్పుపట్టారు. ఒకవేళ ఎవరైనా చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటని నిలదీశారు. కారులో డబ్బులు లేకపోతే ఎందుకు ఆపకుండా వెళ్లిపోయారని నారాయణ సందేహం వ్యక్తం చేశారు. మంత్రి అజయ్‌ను కేబినెట్ నుంచి తప్పించాలని నారాయణ డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.