హోమ్ /వార్తలు /national /

Perni Nani counters NTR Family: ‘బాలయ్య అమాయక చక్రవర్తి...’ ఎన్టీఆర్ కుటుంబానికి పేర్ని నాని కౌంటర్..

Perni Nani counters NTR Family: ‘బాలయ్య అమాయక చక్రవర్తి...’ ఎన్టీఆర్ కుటుంబానికి పేర్ని నాని కౌంటర్..

సినిమా సినిమాకు నిబంధనలు మారవని పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ఏపీ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ సినిమాకు ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమాను వందల కోట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఈ షాకుల మీద షాకులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ఇది చాలదన్నట్లు ఢిల్లీ, ముంబైలో థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీకి కుదిస్తూ మూసివేస్తూ ఆంక్షలు వెలువడ్డాయి.

సినిమా సినిమాకు నిబంధనలు మారవని పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ఏపీ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ సినిమాకు ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమాను వందల కోట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఈ షాకుల మీద షాకులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ఇది చాలదన్నట్లు ఢిల్లీ, ముంబైలో థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీకి కుదిస్తూ మూసివేస్తూ ఆంక్షలు వెలువడ్డాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (TDP Chief Chandra Babu Naidu) సతీమణి భువనేశ్వరిని అవమానించారంటూ ఎన్టీఆర్ కుటుంబం చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) కౌంటర్ ఇచ్చారు. అధికారం కోసం చంద్రబాబు మెలోడ్రామాకు తెరతీశారని.. ఏమీ జరగక పోయినా ఏదో జరిగిపోయినట్లు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు.

ఇంకా చదవండి ...

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (TDP Chief Chandra Babu Naidu) సతీమణి భువనేశ్వరిని అవమానించారంటూ ఎన్టీఆర్ కుటుంబం చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) కౌంటర్ ఇచ్చారు. అధికారం కోసం చంద్రబాబు మెలోడ్రామాకు తెరతీశారని.. ఏమీ జరగక పోయినా ఏదో జరిగిపోయినట్లు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తావనే రాలేదని పేర్ని నాని స్పష్టం చేశారు. మా వాళ్లు అనని మాటలను ఆపాదించడం సరికాదన్నారు. అసలు జరగని విషయంపై ఎన్టీఆర్ కుటుంబం మాట్లాడటం దురదృష్టకరణన్నారు. సభలో ఏ ఎమ్మెల్యే అలా మాట్లాడారో బయటపెట్టాలని.. ఆ రికార్డులు చూపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఫీడ్ మొత్తం చూసి నిజాలు తెలుసుకోవాలన్నారు. ఎన్టీ రామారావుపై ఆయన కన్నబిడ్డల్లోనే విషాన్ని ఎక్కించిన ఘనత చంద్రబాబుది అని పేర్ని నాని ఆరోపించారు

ఎన్టీఆర్ గురించి గర్వంగా చెప్పుకునే ఆయన పిల్లల్ని కూడా కన్నతండ్రిపై ఎగదోశారన్నారు. అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదో అన్నట్లు క్రియేట్ చేసి నందమూరి కుటుంబంతో ప్రెస్ మీట్ పెట్టించారని ఆరోపించారు. వ్యవసాయంపై చర్చ జరుగుతున్నప్పుడు సభలో సీఎం జగన్ లేకపోయినా చంద్రబాబు పనిగట్టుకొని అసత్యాలు మాట్లాడారన్నారు. అసెంబ్లీలో సీఎం బాబాయి గురించి, హత్య గురించి, తల్లి గురించి, చెల్లి గురించి మాట్లాడదామా అంటూ చంద్రబాబు రెచ్చగొట్టారని పేర్ని నాని వెల్లడించారు.

ఇది చదవండి: బొత్స కుటుంబంలో రాజకీయ చిచ్చు..? అక్కడే చెడిందా..?


చంద్రబాబు ఈ రాష్ట్ర రాజకీయాలను ఎన్ని మలుపులు తిప్పాలనుకుంటున్నారో అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పిలుపునిచ్చిన నిరసలనలకు అర్ధమేంటో చెప్పాలన్నారు. ఇంత వికృత రాజకీయాలు చేసే పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవన్నారు. బాలకృష్ణ ఒక అమాయక చక్రవర్తి అని.. ఆయన చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తారని ఎద్దేవా చేశారు. గతంలో జరిగిన పరిణామలు చూసినా.. తాజా పరిణామాలు పరిశిలించినా.. చంద్రబాబు చెప్పుడు మాటలను ఎన్టీఆర్ కుటుంబం వింటోందని ఆయన అన్నారు. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడలని హితవు పలికారు. టీడీపీ హాయంలో అసెంబ్లీని ఏకపక్షంగా నడిపినప్పుడు బాలయ్య ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు.

ఇది చదవండి: సలహాదారులపై జగన్ కి నమ్మకం సడలిందా..? వాళ్లని సాగనంపడం ఖాయమేనా..?


ఒక మహిళ గురించి అలా మాట్లాడిన అవసరం ఎవరికి ఉంటుందని పేర్ని నాని ప్రశ్నించారు. అసెంబ్లీలో బూతులు మాట్లాటో సంస్కృతిని అలవాటు చేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. అది అసత్యమని పేర్ని నాని స్పష్టం చేశారు. వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు సీఎంగా ఉన్నది చంద్రబాబేనని.. అప్పుడు అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap minister perni nani, Nandamuri balakrishna, Ysrcp

ఉత్తమ కథలు