హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPoll: అలా చిచ్చు పెట్టాలని బీజేపీ కుట్ర.. మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు

Dubbaka ByPoll: అలా చిచ్చు పెట్టాలని బీజేపీ కుట్ర.. మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కి దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28వందల ఎజెండాలు ఉంటాయని విమర్శించారు.

  తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కు దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 వందల ఎజెండాలు ఉంటాయని విమర్శలు గుప్పించారు. ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ కు పరాజయం తప్పదు అన్నట్లు ప్రచారం చేసినా.. ప్రజలు కేసీఆర్ నాయకత్వానికే జై కొడుతున్నారన్నారు. నిన్న బీజేపీకి రాజీనామా చేసిన రావుల శ్రీధర్ రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో సోమవారం టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలంతా ఆర్భాట ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో వారి ఫలితాలు శూన్యమని ఎద్దేవా చేశారు. గడిచిన ఆరేళ్లలో తెలంగాణకు టీఆర్ఎస్ చేసింది ఏంటో అంకెలతో సహా లెక్కలు చెబుతామని స్పష్టం చేశారు. రూ. 2.72 లక్షల కోట్లను కేంద్రానికి తెలంగాణ ఇచ్చిందన్నారు. కానీ కేంద్రం నుంచి తెలంగాణ వచ్చింది రూ. 1. 29 లక్షల కోట్లు మాత్రమేనన్నారు.

  జీడీపీ లో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే వెనుకబడ్డామని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నల్లధనం తెచ్చి ఒక్కో అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామని గతంలో బీజేపీ నేతలు అన్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశానికి నల్లధనం తెలీదు కానీ నల్ల చట్టాలు తెచ్చారని విమర్శలు గుప్పించారు. బీజేపీతో ఏ వర్గం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టాలని కొంత మంది కుట్ర చేస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్ధేశించి ఆరోపించారు. తెలంగాణ మట్టిలో పరమత సహనం ఉందన్నారు. విద్వేషపు విత్తనాలకు తెలంగాణ లో స్థానం లేదన్నారు. కేవలం రాజకీయం కోసం తెలంగాణ పేరును నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.

  ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరిన రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణ భవిష్యత్ అంతా కేసీఆర్, కేటీఆర్ తోనే ఉందన్నారు. రాబోయే రోజుల్లో తన అనుభవం అంతా తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ.. పని చేస్తానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతేడాది ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. టీఆర్ఎస్ కు ఈ సారి 99 స్థానాలకు మించి వస్తాయన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేనని ధీమా వ్యక్తం చేశారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Dubbaka By Elections 2020, KTR, Telangana bjp

  ఉత్తమ కథలు