హోమ్ /వార్తలు /national /

Kodali Nani: ఆ పని చేయలేకపోతే రాష్ట్రం వదిలి వెళ్లిపోతా.., మంత్రి కొడాలి నాని శపథం...

Kodali Nani: ఆ పని చేయలేకపోతే రాష్ట్రం వదిలి వెళ్లిపోతా.., మంత్రి కొడాలి నాని శపథం...

మంత్రి కొడాలి నాని (ఫైల్ ఫోటో)

మంత్రి కొడాలి నాని (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress Party), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల (Telugu Desham Party) మధ్య రాజకీయ వైరం మరింత ముదురుతోంది. మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani), మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Umamaheswara Rao) సవాళ్లతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయ వైరం మరింత ముదురుతోంది. ముఖ్యంగా కృష్ణాజిల్లాలో మంత్రి కొడాలి నాని , మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. మేనిఫెస్టోలోని హామీల అమలుపై ఇద్దరు నేతలు ఛాలెంజ్ విసురుకున్న నేపథ్యంలో గొల్లపూడి సెంటర్ కు ఉమా రావడం, అక్కడే వైసీపీ కార్యకర్తలు మోహరించడంతో తీవ్రఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లిన దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి కాస్త చల్లారింది. ఐతే దేవినేని ఉమా అరెస్టుకు నిరసనగా గొల్లపూడిలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

  కొడాలి నాని శపథం

  దేవినేని ఉమా పేరు చెప్తే ఇంతెత్తున లేస్తున్న మంత్రి కొడాలి నాని మరోసారి ఆయనపై పంచుల వర్షం కురిపించారు. రాష్ట్రంలో చేతగాని వాళ్లలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉమా ఉంటాడన్నారు. దేవినేని ఉమా ఎక్కడికి వచ్చినా తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. నేను ఒక్కడినే వస్తా.. దమ్ముంటే ఉమా రావాలని నాని అన్నారు. చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమైనా ఉంటే దేవినేని ఉమాను కొట్టడం ఖాయమన్నారు. ఉమాను కొట్టకపోతే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని కొడాలి నాని శపథం చేశారు. బహిరంగ చర్చకు పోలీసులు అనుమతివ్వరని తెలిసినా దేవినేని ఉమా ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించిన నాని.., తాను ఫోన్ చేస్తే భయపడి లిఫ్ట్ చేయడం లేదని ఎద్దేవా చేశారు. వదినను చంపి ఎమ్మెల్యే అయ్యాడని మరోసారి ఆరోపించారు. తాను చేసిన ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నానని కొడాలి నాని స్పష్టం చేశారు.

  రౌడీలెవరో తేలుస్తాం..!

  ఇదిలా ఉంటే గొల్లపూడి సెంటర్లో సమరానికి సై అంటూ వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యారు. ఉదయమే గొల్లపూడి సెంటర్ కు చేరుకున్న వంశీ.., దేవినేని ఉమాపై మండిపడ్డారు. చర్చకు రమ్మంటే పారిపోవడమేంటన్నారు. బెజవాడలో రౌడీయిజం చేసిందెవరో, మర్డర్లు చేసిందెవరో అందరికీ తెలుసున్నారు. పోలవరం కాలువల పేరుతో కోట్లు దోచేసిన వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. చర్చకు రమ్మంటే ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఐతే మైలవరం ఇష్యూలో వంశీ ఎంటర్ అవడం చర్చనీయాంశమవుతోంది. ఇక దేవినేని ఉమా ప్రత్యర్థి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ ను విమర్శిస్తే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. అంతేకాదు దేవినేని కుటుంబ సభ్యులతోనే మాజీ మంత్రిపై ఆరోపణలు చేయించడం కొసమెరుపు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP Politics, Devineni uma, Devineni Uma Maheswara Rao, Kodali Nani, Krishna District, Tdp, Vallabhaneni Vamshi, Ysrcp

  ఉత్తమ కథలు