హోమ్ /వార్తలు /national /

కొడాలి నాని మామూలోడు కాదు... టీడీపీలో టెన్షన్...

కొడాలి నాని మామూలోడు కాదు... టీడీపీలో టెన్షన్...

చంద్రబాబు నాయుడు,కొడాలి నాని(File Photo)

చంద్రబాబు నాయుడు,కొడాలి నాని(File Photo)

సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీలోని కొందరు నేతలు స్వాగతిస్తున్నారనే విషయాన్ని కొడాలి నాని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

టీడీపీని తనదైన స్టయిల్లో విమర్శించడంలో ప్రత్యేకత చాటుకున్న ఏపీ మంత్రి కొడాలి నాని... వైసీపీ కీలక నేతల్లో ఒకరిగా మారిపోయారు. అసెంబ్లీతో పాటు బయట కూడా చంద్రబాబుపై రాజకీయ విమర్శలు చేయడంలో కొడాలి నాని దూకుడు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా తాను ఇన్‌ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీకాకుళం జిల్లాలో టీడీపీని దెబ్బకొట్టేందుకు కొడాలి నాని గట్టిగానే పావులు కదుపుతున్నట్టు ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని సీఎం జగన్ సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయాన్ని మాజీమంత్రి, టీడీపీ నేత కొండ్రు మురళి సమర్థించడం వెనుక కొడాలి నాని ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీలోని కొందరు నేతలు స్వాగతిస్తున్నారనే విషయాన్ని కొడాలి నాని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఆయన చెప్పినట్టుగానే ఎన్నికలకు కొద్ది నెలల ముందు టీడీపీలో చేరిన మాజీమంత్రి కొండ్రు మురళి.... విశాఖపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. అంతేకాదు ఈ విషయంలో పార్టీ కంటే ప్రాంతమే ముఖ్యమని ఆయన టీడీపీ విధానపరమైన నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.

కొండ్రు మురళి బాటలోనే మరికొందరు టీడీపీ నేతలు... ఆ పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడితే... ఈ విషయంలో ఆ పార్టీలో చీలక వచ్చే అవకాశం ఉందని వైసీపీ ప్లాన్ చేసినట్టు టీడీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీని రాజకీయంగా దెబ్బకొట్టే ఈ వ్యూహం వెనుక కొడాలి నాని ఉన్నారని భావిస్తోంది.

First published:

Tags: Chandrababu naidu, Kodali Nani, Srikakulam, Tdp, Ysrcp

ఉత్తమ కథలు