ఏపీ మంత్రి కొడాలి నాని సరదాగా గన్ ఎక్కుపెట్టారు. పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా గుడివాడలో ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శన ఓపెన్ హౌస్‌ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రాణాలు లెక్కచేయకుండా పోలీసులు బాధ్యతలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పగలు, రాత్రి తేడా లేకుండా పోలీసులు కష్టపడుతున్నారని చెప్పారు. పోలీసులు అంటే ప్రజలకు ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఇలా ఓపెన్ హౌస్ నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులకు వారాంతపు సెలవును ప్రకటించారని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఓపెన్ హౌస్ లో భాగంగా ఆయుధాల ప్రదర్శనను మంత్రి తిలకించారు. ఆయుధాల పనితీరు, ఆయుధాలు వినియోగించే విధానం, తమను తాము రక్షించుకునే పద్ధతులను పోలీసులు..మంత్రికి వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.