హోమ్ /వార్తలు /national /

చంద్రబాబు, దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం

చంద్రబాబు, దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుండగా..యలమర్రు పామర్రు పరిధిలో ఉంది.

కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుండగా..యలమర్రు పామర్రు పరిధిలో ఉంది.

AP Minister Kodali Nani: దోమలపై దండయాత్ర చేసిన చంద్రబాబు.. కరోనాపై ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. తనపై విమర్శలకు దిగిన టీడీపీ నేత దేవినేని ఉమాకు కొడాలి నాని ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.

  Kodali Nani Comments: టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి దేవినేని ఉమపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చే హామీలకు సంబంధించిన పేజీలు వేలల్లో ఉంటాయని ఎద్దేవా చేశారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఆయన హయాంలో రైతులను మానసికంగా హింసించి ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. దోమలపై దండయాత్ర చేసిన చంద్రబాబు.. కరోనాపై ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. తనపై విమర్శలకు దిగిన టీడీపీ నేత దేవినేని ఉమాకు కొడాలి నాని ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.


  దేవినేని ఉమా చరిత్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఆయన ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని వ్యాఖ్యానించారు. దేవినేని ఉమా తండ్రి సోడాలు కొట్టేవాడని అన్నారు. వాటిని ఆయన కడిగేవాడని ఆరోపించారు. చంద్రబాబే పెద్ద భిక్షగాడన్న నాని.. ఆయన తనకు రాజకీయ భిక్ష పెట్టడమేంటని అన్నారు. సీఎం జగన్‌ తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, ఆయన వల్లే తాను మంత్రిగా ఉన్నానని వ్యాఖ్యానించారు. రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందేలా చేయడమే సీఎం జగన్ ఆకాంక్ష అని మంత్రి కొడాలి నాని అన్నారు. రైతులు వాడుకున్న విద్యుత్‌కు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని స్పష్టం చేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu naidu, Devineni Uma Maheswara Rao, Kodali Nani

  ఉత్తమ కథలు