హోమ్ /వార్తలు /national /

Dubbaka ByElection Results: ఓటమికి నాదే బాధ్యత.. దుబ్బాక ఫలితాలపై హరీష్ రావు షాకింగ్ ప్రకటన..

Dubbaka ByElection Results: ఓటమికి నాదే బాధ్యత.. దుబ్బాక ఫలితాలపై హరీష్ రావు షాకింగ్ ప్రకటన..

హరీష్ రావు (File)

హరీష్ రావు (File)

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమిపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా తీర్పును శిరసా వహిస్తామన్నారు. ఉప ఎన్నిక ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు.

  దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమిపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా తీర్పును శిరసా వహిస్తామన్నారు. ఉప ఎన్నిక ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతీ ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. దుబ్బాకలో ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. తమ పార్టీలో లోపాలను సవరించు కుంటామన్నారు. దుబ్బాక ప్రజల సేవకు నిరంతరం పాటు పడతామన్నారు. ఆ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. తాము ఓటమి చెందినప్పటికీ దుబ్బాక ప్రజల పక్షాన, అక్కడ టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంటామన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రజలకు , కార్యకర్తలకు, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హరీష్ అన్నారు.

  దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు తెలంగాణ రాజకీయాలతో పాటు టీఆర్ఎస్ రాజకీయాలపై కూడా చాలావరకు ప్రభావం చూపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పడి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ కారణంగానే సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోనూ టీఆర్ఎస్ విజయం అంత కష్టమేమీ కాదని అంతా అనుకున్నారు. అందులోనూ దుబ్బాక ఉప ఎన్నికల వ్యవహారాలను చూసేది హరీశ్ రావు కావడం.. దుబ్బాక సిద్ధిపేటకు పక్కనే ఉన్న నియోజకవర్గం కావడంతో దుబ్బాకలో టీఆర్ఎస్‌ను హరీశ్ రావు చాలా సులభంగా గెలిపిస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.

  కానీ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రావడంతో.. టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించిన హరీశ్ రావుకు ట్రబుల్స్ తప్పకపోవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తరువాత మీడియాలో మాట్లాడిన కేటీఆర్ చేసిన పలు వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫలితం తాము ఊహించని విధంగా రాలేదని మంత్రి కేటీఆర్.. ఈ ఫలితం ఒక రకంగా తమ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తం కావడానికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Harish Rao, Trs