హోమ్ /వార్తలు /national /

Dubbaka Bypolls: దుబ్బాకలో గెలిపిస్తే ఆ బాధ్యత నాదే.. హమీలతో చక్రం తిప్పుతున్న మంత్రి హరీష్

Dubbaka Bypolls: దుబ్బాకలో గెలిపిస్తే ఆ బాధ్యత నాదే.. హమీలతో చక్రం తిప్పుతున్న మంత్రి హరీష్

మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు(ఫైల్ ఫొటో)

మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు(ఫైల్ ఫొటో)

దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నిర్వహించిన వైశ్య సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓసీ పేదలకు సహాయం అందుతుందంటే.. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అని అన్నారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ ను తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు.

ఇంకా చదవండి ...

  ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయ వేడి తారా స్థాయికి చేరుతోంది. సొంత స్థానంలో గులాబీ జెండా ఎగుర వేసి రాష్ట్రంలో తమకు తిరుగులేదని చాటాలని అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీ ఎన్నికల స్పెషలిస్ట్, అదే జిల్లాకు చెందిన మంత్రి హరీష్ రావు ముందుండి పార్టీ శ్రేణులను నడిపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు సైతం ఇక్కడ విజయం సాధించి.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తామేనన్న సంకేతాలు ఇవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఆయా పార్టీల ముఖ్య నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో కుల సంఘాల సమ్మేళనాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నిర్వహించిన వైశ్య సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమ్మేళనానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఓసీ పేదలకు సహాయం అందుతుందంటే.. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అని అన్నారు. ఆర్య వైశ్య కార్పోరేషన్ ను తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

  దుబ్బాక నియోజకవర్గానికి ఇప్పుడు వచ్చే వాంతా కేవలం ఓట్ల కోసమే వస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కు దుబ్బాక ఎలా ఉంటుందో తెలియదని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ మంత్రిగా ఉన్న సమయంలో ఒక్క సారి కూడా దుబ్బాకకు రాలేదన్నారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలిస్తే ఎమొచ్చింది అని ఉత్తమ్ అడుగుతున్నారని గుర్తు చేశారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలిచాక సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గానికి వెళ్లి రూ. 300 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం దుబ్బాకకు అదే రీతిలో అభివృద్ధి పనులు మంజూరు అవుతాయని హామీ ఇచ్చారు.

  ‘దుబ్బాక అభివృద్ధి బాధ్యత హరీశ్ రావుదే.. అనుమానం అవసరం లేదని’ మంత్రి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతక్క తన తోబుట్టువన్నారు. సీఎం కేసీఆర్ కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాకను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో నారాయణ ఖేడ్ నియోజకవర్గాన్ని సైతం సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అలాగే అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. అక్కడ రూ. 200 వందల కోట్లకు పైగా నిధులు వెచ్చించి రోడ్లు వేయించామని చెప్పారు. ఎన్నికల వరకే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇక్కడ ఉంటారని విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కూడా తాను, టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత ఇక్కడే ఉంటామని చెప్పారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Trs

  ఉత్తమ కథలు