హోమ్ /వార్తలు /national /

KCR Birthday | మంత్రి హరీష్ రావు నోట రిటర్న్ గిఫ్ట్ మాట..

KCR Birthday | మంత్రి హరీష్ రావు నోట రిటర్న్ గిఫ్ట్ మాట..

సిద్ధిపేట జిల్లాలోనే దుబ్బాక ఉండటంతో.. ఇక్కడ టీఆర్ఎస్ సాధించబోయే మెజార్టీ హరీశ్ రావుకు ప్రతిష్టాత్మకం కానుంది. టీఆర్ఎస్ తరపున బరిలో దిగబోయే అభ్యర్థి ఎవరైనా.. అంతా తానై వ్యవహరించి పార్టీ గెలుపు కోసం హరీశ్ రావు కృషి చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో జరిగే శుభకార్యాల్లో రిటర్న్‌ గిఫ్ట్‌గా మొక్కలు ఇద్దామని మంత్రి హరీష్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

రిటర్న్ గిఫ్ట్.. ఈ మాట వినగానే కేసీఆర్, చంద్రబాబు గుర్తొస్తారు. గత తెలంగాణ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ మాట జోరుగా ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియా, వార్తలు.. ఇలా ఏ నోట విన్నా రిటర్న్ గిఫ్ట్ మాటే వినిపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, కేసీఆర్ సీఎం బాధ్యతలు చేపట్టే సందర్భంలో.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించారు. ఆ రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు పదవీచ్యుతుడిని చేయడమేనని అంతా అనుకున్నారు. కాగా, ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ మాట మంత్రి హరీష్ రావు నోట వినిపించడం సంచలనానికి తెర తీసింది. వివరాల్లోకెళితే.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి హరీష్ పాల్గొన్నారు. సిద్దిపేట సుడా కార్యాలయం ముందు సుడా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాబోయే రోజుల్లో జరిగే శుభకార్యాల్లో రిటర్న్‌ గిఫ్ట్‌గా మొక్కలు ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 10 వేల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. తెలంగాణను సీఎం కేసీఆర్‌ హరిత తెలంగాణగా మార్చుతున్నారని అన్నారు. మాటల్లో భాగంగా మంత్రి హరీష్.. రిటర్న్ గిఫ్ట్ అన్న పదం వాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది.

First published:

Tags: CM KCR, Harish Rao, KCR Return Gift

ఉత్తమ కథలు