హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Central Vista: అప్పుడు కాంగ్రెస్ నేతలే లేఖ రాశారు.. వారిది వింత వాదన.. సెంట్రల్ విస్టాపై కాంగ్రెస్ విమర్శలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఫైర్..

Central Vista: అప్పుడు కాంగ్రెస్ నేతలే లేఖ రాశారు.. వారిది వింత వాదన.. సెంట్రల్ విస్టాపై కాంగ్రెస్ విమర్శలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఫైర్..

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ(ఫైల్ ఫొటో)

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ(ఫైల్ ఫొటో)

సెంట్రల్ విస్టాపై కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేపట్టిన ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనాతో దేశం అతలాకుతలం అవుతున్న వేళ సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును కొనసాగించడం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. సెంట్రల్ విస్టా అనేది క్రిమినల్ వెస్టేజ్ అని వ్యాఖ్యానించారు. ‘ప్రజల జీవితాలను కాపాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని.. కొత్త భవనాన్ని నిర్మించాలనే గుడ్డి అహంకారాన్ని పక్కన బెట్టాలని’ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే సెంట్రల్ విస్టాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై.. కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన.. ఆ పార్టీ సిగ్గుమాలిన ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు.

‘సెంట్రల్ విస్టాపై కాంగ్రెస్ వాదన వింతగా ఉంది. చాలా ఏళ్లుగా సెంట్రల్ విస్టాకు ఖర్చు చేయాల్సింది రూ. 20 వేల కోట్లు అని చెప్పాం. దేశంలో వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇందుకు దాదాపు రెండు రెట్ల మొత్తం కేటాయించింది. ఈ ఏడాది కేంద్ర ఆరోగ్య శాఖ బడ్జెట్ రూ. 3 లక్షల కోట్లకు పైగా ఉంది. మన ప్రాధాన్యతల గురించి మాకు తెలుసు. అంతేకాకుండా ఇప్పటివరకు కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌కు రూ. 862 కోట్లు, సెంట్రల్ విస్టా కోసం రూ. 477 కోట్లు మాత్రమే ఇవ్వబడ్డాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో చాలా భాగాలు ఉన్నాయి.


కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వారి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి అబద్దాలను వ్యాప్తి చేయాలని వారు కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది స్కిల్డ్, సెమీ సిల్డ్క్, అన్ సిల్డ్క్ వర్కర్స్‌కు ఉపాధి కల్పిస్తుందని తెలిసినప్పటికీ.. కాంగ్రెస్ చీప్ పాలిటిక్స్ చేస్తోంది. సెంట్రల్ వీస్టా మీద కాంగ్రెస్ ఇలాంటి విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు.. మహారాష్ట్రలో ఎమ్మెల్యే హాస్టల్ పుననిర్మాణం, చత్తీస్‌ఘడ్‌లో కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణం చేపట్టాయి. అవి సరైనవి అయినప్పుడు.. సెంట్రల్ విస్టాతో సమస్య ఏమిటి?. కాంగ్రెస్ ఇలాంటి డ్రామాలు ఆపదు. సిగ్గుమాలిన వారి ద్వంద్వ నీతి ఎలా ఉందో చూడండి‌’అంటూ హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు.

‘యూపీ‌ఏ హయాంలో కొత్త పార్లమెంట్ భవనం ఆవశ్యకత గురించి కాంగ్రెస్ నేతలు 2012లో లేఖ రాశారు. 2012లో అప్పటి స్పీకర్ అప్పుడున్న కేంద్ర పట్టణాభివృద్ది శాఖకు ఇదే విషయంపై లేఖ కూడా రాశారు. ఇప్పుడు అదే ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు’ అని మంత్రి పేర్కొన్నారు.

మరోవైపు సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను ఆపాలని అన్య మల్హోత్రా సొహైల్‌ హశ్మి.. ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు మే 17కి వాయిదా వేసింది. అయితే ఈ అంశంపై సత్వర విచారణ జరపాలని పిటిషనర్లు బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్ తరఫున లాయర్ సిద్దార్థ్ లూథ్రా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు.. ఈ అంశం ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున్న జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ పిటిషన్‌ను ముందస్తుగా విచారించే అంశాన్ని పరిశీలించాలిన ఢిల్లీ హైకోర్టును సుప్రీం కోర్టు కోరింది.

First published:

Tags: Bjp, Central Government, Congress, Indian parliament

ఉత్తమ కథలు