హోమ్ /వార్తలు /national /

మంత్రి ఈటలపై నిజంగా కుట్ర జరిగిందా..? పొమ్మన లేక పొగబెడుతున్నారా..?

మంత్రి ఈటలపై నిజంగా కుట్ర జరిగిందా..? పొమ్మన లేక పొగబెడుతున్నారా..?

మొత్తానికి రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునే దిశగా సమాలోచనలు జరుపుతున్న ఈటల రాజేందర్.. జూన్ 2 తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమా లేక బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటన చేయడమో చేస్తారనే చర్చ జరుగుతోంది.

మొత్తానికి రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునే దిశగా సమాలోచనలు జరుపుతున్న ఈటల రాజేందర్.. జూన్ 2 తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమా లేక బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటన చేయడమో చేస్తారనే చర్చ జరుగుతోంది.

బడుగు బలహీనవర్గాల పక్షపాతి అయిన ఈటలపై కావాలనే కుట్ర చేస్తున్నారని.. బహుజన వర్గాలకు చెందిన నేతలను మంత్రివర్గంలో లేకుండా చేసేందుకే ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారని బీసీ ఫోరం ఆరోపించింది.

  తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు పెద్ద కుట్రే జరుగుతోందని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆరోపించింది.ఒకవేళ ఈటలను గనుక మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఉద్యమించక తప్పదని హెచ్చరించింది. బడుగు బలహీనవర్గాల పక్షపాతి అయిన ఈటలపై కావాలనే కుట్ర చేస్తున్నారని.. బహుజన వర్గాలకు చెందిన నేతలను మంత్రివర్గంలో లేకుండా చేసేందుకే ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారని ఆ ఫోరం ఆరోపించింది. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామని కేసీఆరే స్వయంగా చాలా సందర్భాల్లో వెల్లడించారని.. అలాంటప్పుడు అందులో రహస్యమేముందని ఫోరం నాయకులు ప్రశ్నించారు.

  ఈటల చుట్టూ ముసురుకున్న ఈ వివాదంపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ రెవెన్యూ చట్టం గురించి చెప్పిన విషయాలను ఈటల నిజంగానే లీక్ చేశారా..? లేక ఒక ప్లాన్ ప్రకారం ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించడానికే ఆయనపై బురదజల్లే కార్యక్రమం జరుగుతోందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి రెండోసారి అధికారంలోకి వచ్చాక..ఈటలకు మంత్రిపదవి ఇవ్వడానికి కేసీఆర్ అంత సుముఖత ప్రదర్శించలేదని.. అయినా సరే చివరి నిమిషంలో ఇవ్వక తప్పలేదన్న వాదన వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈటలను తప్పించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఇలా ఇరికించేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.మరోవైపు ఈటల మాత్రం.. తనపై జరుగుతున్న ప్రచారం నిరాధారం అని, దీనిపై ఎక్కువ చర్చ వద్దని సున్నితంగా చెప్పేశారు. అయితే ఆయన సన్నిహితులు,మద్దతుదారులు మాత్రం ఈటలపై వినిపిస్తోన్న ఊహాగానాలు ఎక్కడ నిజమవుతాయోనన్న ఆందోళనలో ఉన్నారు.

  ఇది కూడా చదవండి : మంత్రి పదవి నుంచి ఈటెల అవుట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..?

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: CM KCR, Etela rajender, Telangana