Home /News /national /

POLITICS MINISTER ETELA RAJENDER KEY COMMENTS ON HIS MINISTER POST BS

నాకు మంత్రి పదవి అలా దక్కింది.. ఈటల సంచలన వ్యాఖ్యలు..

Video : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా లేదు : మంత్రి ఈటల

Video : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా లేదు : మంత్రి ఈటల

మంత్రి పదవి దక్కడంపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి స్పందించారు. ఆ పదవి తన తల్లిదండ్రులు ఇచ్చింది కాదని, హుజూరాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వచ్చిందని అన్నారు.

    మంత్రి పదవి దక్కడంపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి స్పందించారు. ఆ పదవి తన తల్లిదండ్రులు ఇచ్చింది కాదని, హుజూరాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వచ్చిందని అన్నారు. తన పదవికి ప్రజలే హక్కుదారులని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో సోమవారం జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎవరి పదవులైనా ప్రజల అవసరాలు తీర్చడానికేనని అన్నారు. సమైక్య రాష్ట్ర పాలనలో రూ.20లక్షలు కావాలంటే చాలా ఇబ్బంది పడ్డామని, నాడు ఏ పని చేయకపోయినా తనపై ఉన్న విశ్వాసంతో ప్రజలు గెలిపించారని అన్నారు. అందుకే ప్రజల రుణం తీర్చుకోవాలని నిరంతరం తపన పడేవాడినని, 2014లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు.

    మురికి పని చేసే వారంతా దళిత బిడ్డలేనని, వారికి జీతం ఇవ్వాలన్న ఉద్దేశంతో మునిసిపాలిటీల్లో రీవోల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పందుల బెడద లేకుండా చేయడంతో పాటు, ఎరుకల వాళ్లకు పందుల పెంపకానికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక షెడ్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. జమ్మికుంట ప్రజలకు 20 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవని, ఆ వ్యధ తీర్చడానికి జమ్మికుంటకు రూ.40 కోట్లు, హుజూరాబాద్‌‌‌కు రూ.50 కోట్లు మంజూరు చేశామన్నారు. తాను ఉన్నంత వరకు ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వనని, పని చేసిపెట్టే బాధ్యత తనదేనని మంత్రి తేల్చి చెప్పారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Etela rajender, Telangana, Telangana Politics, Trs

    తదుపరి వార్తలు