హోమ్ /వార్తలు /national /

తప్పు చేస్తే కులం ఏంటి ?.. టీడీపీపై మండిపడ్డ ఏపీ మంత్రి

తప్పు చేస్తే కులం ఏంటి ?.. టీడీపీపై మండిపడ్డ ఏపీ మంత్రి

టీడీపీ నేతలే సీబీఐ విచారణ జరిపించాలని కోరారని మంత్రి అనిల్ అన్నారు. టీడీపీ పెద్దలు రాజధాని  గ్రామాల్లో భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వమే అమరావతి భూముల వ్యవహారంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ ప్రొత్సహించిందని అన్నారు.

టీడీపీ నేతలే సీబీఐ విచారణ జరిపించాలని కోరారని మంత్రి అనిల్ అన్నారు. టీడీపీ పెద్దలు రాజధాని గ్రామాల్లో భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వమే అమరావతి భూముల వ్యవహారంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ ప్రొత్సహించిందని అన్నారు.

తప్పు చేసి అడ్డంగా దొరికితే కులాన్ని అంటగట్టడం టీడీపీకి మామూలైపోయిందని మంత్రి అనిల్ ఆరోపించారు.

బీసీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. తప్పులు చేసిన వారికి కులం,మతం అంటకట్ట వచ్చా అని ఆయన ప్రశ్నించారు. నేరాలు చేస్తే అరెస్టు చేస్తే తప్పా అని వ్యాఖ్యానించారు. కొల్లు రవీంద్రను స్పష్టమైన ఆధారాలతో అరెస్టు చేశారని మంత్రి అనిల్ అన్నారు. కోల్లు రవీంద్ర తప్పు చేయకపోతే గోడ దూకి ఎందుకు పారిపోయాడని మంత్రి అనిల్ టీడీపీని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు మాటలు చూస్తుంటే కౌరవుల సభ గుర్తుకు వస్తోందని ధ్వజమెత్తారు. ఓ మహిళపైన అసభ్యంగా అయన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్ధిస్తాడా ? అని నిలదీశారు. రూ. 150 కోట్లు దోచిన అచ్చెన్నాయుడి అరెస్టు చేస్తే కూడా బీసీ కులం వాడటం ఏంటని అన్నారు.

తప్పు చేసి అడ్డంగా దొరికితే కులాన్ని అంటగట్టడం టీడీపీకి మామూలైపోయిందని ఆరోపించారు. బీసీలపై ప్రేముంటే ఐదు ఏళ్ల మీరు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండని టీడీపీకి సవాల్ విసిరారు. రూ. 50 వేల కోట్లు ఖర్చు పెడతామని కనీసం 15వేల కోట్లు కూడా ఖర్చు పెట్ట లేదని విమర్శించారు. బీసీలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంది చంద్రబాబే అని మంత్రి అనిల్ మండిపడ్డారు. బీసీల అభివృద్ది కోసం జగన్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే రూ. 20వేల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ప్రతి నామినేట్ పదవుల్లో బీసీ,ఎస్టీ,ఎస్సీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో తనపై కూడా అక్రమంగా కేసులు పెట్టారని.. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని అన్నారు. మరి అప్పుడు తాను బీసీ ఎమ్మెల్యేననే విషయం గుర్తుకురాలేదా అని టీడీపీని ప్రశ్నించారు.

First published:

Tags: Andhra Pradesh, Anil kumar yadav, Tdp, Ysrcp

ఉత్తమ కథలు