హోమ్ /వార్తలు /national /

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై... అసదుద్దీన్ ఓవైసీ సంచలన ట్వీట్స్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై... అసదుద్దీన్ ఓవైసీ సంచలన ట్వీట్స్

అసదుద్దీన్ ఓవైసీ ఫైల్ ఫొటో

అసదుద్దీన్ ఓవైసీ ఫైల్ ఫొటో

ట్విట్టర్ వేదికగా ఓవైసీ సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య ట్విట్టర్ వార్ సాగింది. హైదరాబాద్ అమెరికన్ కంపెనీల్లో జిహాదీలో పనిచేస్తున్నారంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

ట్విట్టర్ వేదికగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ట్వీట్లు చేశారు. సీపీ సజ్జనార్‌ను ప్రశ్నిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దిశ నిందితులు నలుగురిని ఎన్ కౌంటర్ పై ఆయన స్పందించారు. ఉదయం 5 గంటలకు ఎన్ కౌంటర్లు చేయడం దారుణమన్నారు. బుల్లెట్లు కడుపులో దించడం కాదంటూ సజ్జనార్‌ను ప్రశ్నిస్తూ ఓవైసీ ట్వీట్ చేశారు. అవసరమైతే అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ కూడా చేసుకోవచ్చన్నారు.

అసదుద్దీన్ ట్వీట్లు

ట్విట్టర్ వేదికగా ఓవైసీ సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య ట్విట్టర్ వార్ సాగింది. హైదరాబాద్ అమెరికన్ కంపెనీల్లో జిహాదీలో పనిచేస్తున్నారంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి స్పందిస్తూ సీపీ సజ్జనార్ మరో ట్వీట్ చేశారు. దానిపై పనిచేస్తున్నామని... డేటాను కలెక్ట్ చేస్తున్నామన్నారు. 24 గంటలు తమ టీం పనిచేస్తుందన్నారు. ఉగ్రవాదం సమాచారం సేకరించేందుకు మా వద్ద వ్యవస్థ ఉందని తెలిపారు. దీంతో సజ్జనార్ ట్వీట్‌పై మండిపడ్డ ఓవైసీ... టెర్రరిజానికి మతం లేదన్నారు ఓవైసీ. సైబరాబాద్‌లో ఎంతమంది జిహాదీలు ఉన్నారంటూ ప్రశ్నించారు. వాళ్ల సమాచారం మీ వద్ద ఉందా? ఏ కంపెనీలో జిహాదీలు పనిచేస్తున్నారు ? అంటూ ఓవైసీ ట్వీట్ చేశారు. దీంతో వీరిద్దరి ట్వీట్ వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First published:

Tags: Asaduddin Owaisi, Disha accused Encounter, MIM, Sajjanar