హోమ్ /వార్తలు /national /

రాహుల్‌తో హామీ... కోదండరాం విషయంలో కాంగ్రెస్ ప్లాన్

రాహుల్‌తో హామీ... కోదండరాం విషయంలో కాంగ్రెస్ ప్లాన్

రాహుల్ గాంధీ, కోదండరాం

రాహుల్ గాంధీ, కోదండరాం

టీజేఎస్‌కు ఏడు లేదా ఎనిమిది సీట్లకు మించి ఇవ్వొద్దని నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ... కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టో అమలు కమిటీ చైర్మన్ బాధ్యతను కోదండరాంకు అప్పగించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కోదండరాంకు హామీ ఇప్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

ఇంకా చదవండి ...

  మహాకూటమి సీట్ల అంశం ఓ కొలిక్కి రాకముందే తాము పోటీ చేయబోయే సీట్లపై ఒక అవగాహనకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేడు లేదా రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరిగినా... కూటమి అభ్యర్థులందరి పేర్లను ఒకేసారి ప్రకటించాలనే యోచనతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. దాదాపు 95 సీట్లలో తాము పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్... కూటమి పక్షాలు గట్టిగా పట్టుబడితే మరో రెండు సీట్లను వారికి విడిచిపెట్టాలని భావిస్తోంది. టీడీపీకి 14, టీజేఎస్ 8, సీపీఐకు 3 స్థానాలు ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్‌ను ఒప్పించడమే కీలకంగా మారింది.

  తెలంగాణ సమాజంలో విశ్వసనీయత ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న కోదండరాంను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని భావిస్తున్న కాంగ్రెస్... ఎక్కువ సీట్లు ఇవ్వకుండానే ఆయనను ఒప్పించేందుకు మరో వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసమే కోదండరాంను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పిలిపించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. టీజేఎస్‌కు ఏడు లేదా ఎనిమిది సీట్లకు మించి ఇవ్వొద్దని నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ... కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టో అమలు కమిటీ చైర్మన్ బాధ్యతను కోదండరాంకు అప్పగించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కోదండరాంకు హామీ ఇప్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

  టీజేఎస్‌తో సీట్ల సర్దుబాటు అంశంతో పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని కాంగ్రెస్ భావిస్తోందని తెలుస్తోంది. కోదండరాం ఎన్నికల్లో పోటీ చేస్తే... ఆయన ఒకే నియోజకవర్గానికి పరిమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ యోచిస్తోంది. అందుకే ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలంగాణవ్యాప్తంగా ప్రచారంలో భాగస్వామిని చేయాలని నిర్ణయించింది. ఇందుకు కోదండరాంను ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ హామీలతో కోదండరాం కన్విన్స్ అవుతారా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Kodandaram, Mahakutami, Rahul Gandhi, Telangana, Telangana Election 2018, Telangana Jana Samithi

  ఉత్తమ కథలు