నర్సాపూర్ (Narsapur) నియోజకవర్గంలో వలసల పర్వం కొనసాగుతోంది. మెదక్ జిల్లా(Medak District) చిలిప్ చెడ్ మండలం జగ్గంపేట గ్రామానికి చెందిన 50 మంది trs పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ (Congress) నాయకులు పీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, అవుల రాజిరెడ్డి, సోమన్న గారి రవీందర్ రెడ్డి, ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. నర్సాపూర్ లోని ఎంపీపీ క్యాంపు కార్యాలయంలో పార్టీలోకి ఆహ్వానిస్తూ కార్యక్రమం నిర్వహించారు. చేరిన వారికి నర్సాపూర్ లోని ఎంపీపీ క్యాంపు కార్యాలయంలో వారు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ నేతలు అవలంబిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు.
టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన వారిలో నవీన్, యాదగిరి, పోచయ్య, పుల్లయ్య, మోహన్, పాషా తదితరులు ఉన్నారు. త్వరలోనే మరికొంత మంది టీఆర్ఎస్ ముఖ్యనేతలు తమ పార్టీలోకి రానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు మల్లేశం, హకీమ్, రియాజ్, శ్రీనివాస్ గుప్తా, అశోక్, ఉదయ్, రాధాకృష్ణ గౌడ్, దేవి సింగ్ , కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీలు సమస్యలు గట్టిగా లేవనెత్తాలని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సూచించారు. నేటి నుంచి మొదలు కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై హైదరాబాద్ ప్రగతి భవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా రైతాంగ సమస్యలపై కేంద్ర తీరును ఎండగట్టాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని చెప్పారు.
కనీస మద్ధతు ధర చట్టం, విద్యుత్ చట్టాల రద్దు కోసం పోరాడాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు అన్నింటిపై పార్లమెంటల్లో తెలంగాణ వాణి వినింపించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక నేడు కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది. కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేయనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ మాల్స్, థియేటర్స్ పై ఆంక్షలు ఉంటాయని సమాచారం వస్తోంది. ఈ వ్యాప్తి రాష్ట్రంలో విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Telangana Politics, Trs, TRS leaders