హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కాంగ్రెస్‌కి మాయావతి మామూలు ఝలక్ ఇవ్వలేదు!

కాంగ్రెస్‌కి మాయావతి మామూలు ఝలక్ ఇవ్వలేదు!

సీట్ల విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా.. మహాకూటమి నుంచి బయటకు వచ్చేందుకు మాయావతి ఏమాత్రం వెనుకాడరు. కాబట్టే మహాకూటమిలో బీఎస్పీ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకే ఇలాంటి ఝలక్‌లు ఇస్తున్నారని అంటున్నారు.

  2019లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నింటిని ఒక్క తాటి పైకి తీసుకురావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి బీఎస్పీ అధినేత్రి మాయావతి గట్టి షాక్ ఇచ్చింది. పెరుగుతోన్న పెట్రోలు ధరలకు బీజేపీ తప్పిదం ఎంత ఉందో.. కాంగ్రెస్ తప్పిదం కూడా అంతే ఉందని ఆమె ఆరోపించారు. ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ విపక్షాలు సెప్టెంబర్ 10న నిర్వహించిన 'భారత్ బంద్'కు కూడా బీఎస్పీ దూరంగానే ఉంది. ఆ మరుసటి రోజే మాయావతి బీజేపీతో పాటు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది.

  బీజేపీ, కాంగ్రెస్‌ని ఒకే గాటున కట్టి మాయావతి విమర్శించడం కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే మాయావతి వ్యాఖ్యల వెనుక మర్మం వేరే ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే మహాకూటమిలో బీఎస్పీకి ఎక్కువ సీట్లు దక్కించుకోవాలంటే దూకుడుగానే వ్యవహరించాలని ఆమె భావిస్తున్నట్టు చెబుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి నుంచి మరిన్ని సీట్లు పొందేందుకే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  2019లో అధికారం చేజిక్కించుకోవాలంటే మహాకూటమితో ముందుకెళ్లడమే బెటర్ అనే యోచనలో కాంగ్రెస్ ఉంది. అయితే మోదీని హవాను నిలువరించాలంటే.. దేశవ్యాప్తంగా దళిత బహుజన ఓట్లను తమవైపుకు తిప్పుకోవాలని, అందుకు బీఎస్పీ ఇమేజ్ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మిగతా విపక్ష నేతల కంటే మాయావతికే కాంగ్రెస్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము లాంటిదే. అన్ని పార్టీలను ఒప్పించి.. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సీట్లను సర్దుబాటు చేయడం అంత సులువైన వ్యవహారమేమి కాదు.

  సీట్ల విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా.. మహాకూటమి నుంచి బయటకు వచ్చేందుకు మాయావతి ఏమాత్రం వెనుకాడరు. కాబట్టే మహాకూటమిలో బీఎస్పీ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకే ఇలాంటి ఝలక్‌లు ఇస్తున్నారని అంటున్నారు. ఇలాంటి ఝలక్‌ల ద్వారా వచ్చే ఎన్నికల్లో బీఎస్పీకి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలనే యోచనలో ఆమె ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. మాయావతి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహాకూటమి భవిష్యత్తుకు మంచిది కాదని, ప్రజల్లోకి ఇది తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

  First published:

  Tags: Bsp, Congress

  ఉత్తమ కథలు