కర్నాటక బీఎస్పీ ఎమ్మెల్యేపై ఆపార్టీ అధినేత్రి మాయవతి వేటు వేశారు. కర్ణాటకలో ఉన్న ఒకే ఒక్క బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. రెండు రోజుల క్రితం కుమారస్వామి ప్రభుత్వానికి తాను మద్దతివ్వబోనని వెల్లడించిన ఎమ్మెల్యే మహేష్... సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందేనని మాయావతి ఇచ్చిన ఆదేశాలతో మద్దతిస్తానని ప్రకటించారు. అయితే ఆయన కర్నాటక అసెంబ్లీలో జరిగిన బలపరీక్షకు మాత్రం హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన మాయావతి క్రమశిక్షణ చర్యల కింద తక్షణమే మహేష్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్.. బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాయి. మే 2018 లో జెడి (ఎస్) ,కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మాయావతి కీలక పాత్ర పోషించింది. కుమారస్వామి మంత్రివర్గంలో ఎన్ మహేష్ ప్రవేశంతో బిఎస్పి ప్రభుత్వంలో చేరింది. గత ఏడాది మే 23 న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు పోటీ చేయాలని జెడి (ఎస్) నిర్ణయించినప్పుడు కుమారస్వామి ప్రభుత్వం, కూటమి నుంచి బిఎస్‌పి వైదొలిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bsp, Jds, Karnataka, Karnataka Politics, Kumaraswamy, Mayawati