Mayawati Counters Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనపై చేసిన వ్యాఖ్యల్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఖండించారు. శనివారం రాహుల్ గాంధీ..మాయవతిపై తనదైన శైలీలో తీవ్రమైన ఆరోపణలు చేయగా..దీనికి మాయావతి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కేంద్ర సంస్థలకు తాను భయపడతున్నానంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అందులో నిజం లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ.. చెల్లాచెదురైన తన పార్టీని సరిగ్గా నిర్వహించలేక బీఎస్పీ పనితీరును విమర్శిస్తున్నారని..ఇది బీఎస్పీ పట్ల ఉన్న ఆయనకున్న కోపాన్ని, ద్వేషాన్ని స్పష్టంగా చూపిస్తుందని మాయావతి అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. కులతత్వాన్ని, ద్వేషపూరిత భావాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. తమపై ఆరోపణలు చేసే ముందు రాహుల్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు మాయావతి. చాలా ఏళ్ల క్రితం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. బహుజన్ సమాజ్ పార్టీ పరువు తీసేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు ఆయన కుమారుడు రాహుల్ కూడా అదే పని చేస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన పొత్తు ప్రతిపాదనను తానే తిరస్కరించానని చెప్పారు.
రాహుల్ గాంధీ.. ఇతర రాజకీయ పక్షాల గురించి కాకుండా తన సొంత పార్టీ గురించి ఆలోచించాలన్నారు. తనపై, తన పార్టీపై విమర్శలు చేసే ముందు తన సొంత ఇంటిని సక్రమంగా ఏర్పాటు చేసుకోవాలని, సొంత పార్టీపై దృష్టి పెట్టుకోమని మాయావతి రాహుల్ కి కౌంటర్ ఇచ్చారు. చిన్న విషయాలపై కాకుండా యూపీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష చేసుకోమని రాహుల్ కు సలహా ఇచ్చారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీచేసినా బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయాయని.. దీనికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలని మాయావతి అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా చేసేదేమి లేదని మాయావతి అన్నారు. దళితులు, అణగారిన వర్గాల ఆర్థికి స్థితిగతుల్ని మెరుగుపరచడానికి.. కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మాయావతి ఆరోపించారు. కనీసం రిజర్వేషన్ ప్రయోజనాలను కూడా సరిగ్గా అందజేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ వైఖరి కారణంగానే అప్పటి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ తన పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు.
ALSO READ Russia-Ukraine War : వ్యూహం మార్చిన పుతిన్..ఇక భారీ విధ్వంసమే!..మే-9 లాస్ట్ డేట్!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bsp, Congress, Mayawati, Rahul Gandhi