POLITICS MATTER OF PRIDE THAT MOST OF OUR PMS FROM HUMBLE FAMILIES PM MODI PAH
PM Modi: అంబేద్కర్ జయంతి.. ప్రధాన మంత్రుల జీవిత విశేషాలున్న మ్యూజియం ప్రారంభించిన నరేంద్ర మోదీ..
మ్యూజియం ప్రారంభత్సవ వేడుకలో ప్రధాని మోదీ
Delhi: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుని ఢిల్లీలో ప్రధాన మంత్రుల జీవిత విశేషాలతో ఉన్న మ్యూజియం ను ప్రారంభించారు.
That Most Of Our PMs From Humble Families: మన దేశానికి ప్రధానులుగా పనిచేసిన వారంతా.. నిరాండంబర కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే అని మోదీ అన్నారు. రాజ్యంగ నిర్మాత, దార్శనికులు బాబా సాహేబ్ అంబేదర్కర్ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో మ్యూజియం ను ప్రారంభించారు. తొలుత బాబాసాహేబ్ అంబేద్కర్ కు మోదీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీనిలో మన దేశానికి ప్రధానులుగా పనిచేసిన 14 మంది జీవిత చరిత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయని అన్నారు.
వీరంతా ఎలాంటి ఆడంబరం లేని సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే అని తెలిపారు. అలాంటి గొప్ప ప్రధానులకు ఈ మ్యూజియం అంకితమని అన్నారు. ఈ మ్యూజియంలో చరిత్ర తో పాటు.. భవిష్యత్తు కూడా ఉందన్నారు. పార్లమెంటరీ ప్రక్రియకు పునాదులు వేసిన గొప్ప రాజ్యంగ నిర్మాత, దార్శనికుడుని బాబా సాహేబ్ అంబేద్కర్ ను కొనియాడారు. స్వతంత్ర భారత దేశంలో ప్రతి ప్రభుత్వం.. దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి తమ వంతు సహాకారం అందిచాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో "దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో, ఈ మ్యూజియం గొప్ప ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
Speaking at the inauguration of Pradhanmantri Sangrahalaya in Delhi. https://t.co/I2ArKZRJdg
ఈ 75 సంవత్సరాలలో, దేశం అనేక అద్భుతమైన ఘట్టాలను చూసిందన్నారు. అలాంటి క్షణాలకు చరిత్రలో సాటిలేని ప్రాముఖ్యత ఉందని అని ప్రధాన మంత్రి అన్నారు. అటువంటి అనేక క్షణాల సంగ్రహావలోకనాలను ఈ మ్యూజియంలో చూడోచ్చని మోదీ అన్నారు. దేశంలోని ప్రధానమంత్రులందరూ అప్పటి సవాళ్లను అధిగమించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారి వ్యక్తిత్వం, విజయాలు, నాయకత్వానికి భిన్నమైన కోణాలు ఉన్నాయని మోదీ తెలిపారు.
ఇవి ప్రజల స్మృతిలో చిరకాలం నిలిచిపోవాలి. ఈ ప్రధానమంత్రి సంగ్రహాలయ భవిష్యత్తును నిర్మించడానికి శక్తి వనరుగా మారుతుందని నేను నమ్ముతున్నాను అని మోదీ అన్నారు. ఈ మ్యూజియం నుండి మన దేశం మరియు దాని భావి తరాల పౌరులు ఎంత గానో స్ఫూర్తి పొందుతాయన్నారు. మన ప్రధానులు చాలా మంది సామాన్య కుటుంబాల నుండి, మారుమూల, గ్రామీణ ప్రాంతాలు, నిరుపేద కుటుంబాలు, రైతు కుటుంబాల నుండి వచ్చిన వారు కావడం భారతీయులమైన మనకు గర్వకారణమని మోదీ అన్నారు.
ఇది భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్ప సంప్రదాయాలపై విశ్వాసాన్ని బలపరుస్తుందని ప్రధాని అన్నారు. ఈ మ్యూజియంలో పలు ఘట్టాలు చరిత్రతో పాటు భవిష్యత్తును కూడా కలిగి ఉంది. ఈ మ్యూజియం దేశంలోని ప్రజలను.. గతంతో పాటు దేశ అభివృద్ధి ప్రయాణంలో తీసుకువెళుతుందని మోదీ అన్నారు. అంతకుముందు మ్యూజియం తొలి టికెట్‌ను ప్రధాని మోదీ కొనుగోలు చేశారు. ఈ మ్యూజియంలో దేశ ప్రధాన మంత్రుల జీవిత చరిత్రలతో పాటు, భారతదేశ చరిత్రలోని వివిధ అధ్యాయాలను కూడా చూడవచ్చు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.