Manik Saha : కొద్ది రోజుల క్రితం జరిగిన త్రిపుర(Tripura) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. త్రిపురలో ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి..మార్చి 2న ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాలను,బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT)ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఆదివాసీలకు చెందిన తిప్రా మోత పార్టీ 13 స్థానాలు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీపీఎం 11 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. మరోసారి బీజేపీకే(BJP) ప్రజలు పట్టం కట్టడంతో ఈ సారి ఎవరు సీఎం అవుతారనే ఉత్యంఠ నెలకొన్న నేపథ్యంలో బీజేపీ శాసనసభా పక్షం రెండోసారి ముఖ్యమంత్రిగా మాణిక్ సాహాను(Manik Saha) ఎన్నుకుంది.
త్రిపుర ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ అధిష్ఠానం సూచనతో మాణిక్ సాహాను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. త్రిపురలో కొత్త సర్కార్ ఏర్పాటు, మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవం మార్చి 8వ తేదీన నిర్వహించనున్నారు. . ప్రధాని మోదీ , అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Heart Attack Signs : ఈ 5 లక్షణాలు కనిపిస్తే గుండెపోటు వచ్చే అవకాశం!
ఏక్ త్రిపుర , శ్రేష్ఠ్ త్రిపుర నినాదాన్ని మాణిక్ విస్తృతంగా ప్రచారం చేశారు. టౌన్ బర్దోవాలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాణిక్ సాహా గెలిచారు. ఊహించిన విజయాన్ని సాధించామని ఫలితాల తర్వాత ఆయన అన్నారు. బీజేపీ విజయం ఊహించినదే. కాకపోతే మేం ఆసక్తిగా ఎదురు చూశాం అంతే. ఇప్పుడు మా బాధ్యత మరింత పెరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చూపిన దారిలో మేం ముందుకు సాగుతాం అని మాణిక్ సాహా అన్నారు. కాగా,2016లో కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరిన మాణిక్ సాహాను త్రిపుర ఎన్నికలకు 10 నెలల ముందు సీఎంగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు బిప్లబ్ కుమార్ దేబ్ సీఎంగా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tripura