హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

TMC : పీకే స్కెచ్..దీదీకి బిగ్ లాస్..ఫలితం జీరో

TMC : పీకే స్కెచ్..దీదీకి బిగ్ లాస్..ఫలితం జీరో

ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

TMC Spendings in goa elections : పాలిటిక్స్(Politics) ఇప్పుడు చాలా కాస్ట్లీగా మారిపోయాయ్. ఎన్నిక‌ల కొరకు రాజ‌కీయ పార్టీలు చేసే ఖ‌ర్చులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

TMC Spendings in goa elections : పాలిటిక్స్(Politics) ఇప్పుడు చాలా కాస్ట్లీగా మారిపోయాయ్. ఎన్నిక‌ల కొరకు రాజ‌కీయ పార్టీలు చేసే ఖ‌ర్చులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. ఇటీవ‌లి కాలంలో ముగిసిన ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల ఖ‌ర్చుల గ‌ణాంకాలు ఈ విష‌యాల‌ను స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో(Goa assembly elections) రాజకీయ పార్టీల ఖర్చుల వివరాల నివేదికను ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ఆ వివరాల ప్రకారం మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC) అత్యధికంగా గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం రూ. 47.54 కోట్లు ఖర్చు చేయగా,అధికార బీజేపీ(BJP) రూ.17.75 కోట్లు ఖర్చు చేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ రూ.12 కోట్లు, కేజ్రీవాల్ నేతృత్వంలోనే ఆమ్​ ఆద్మీ పార్టీ రూ.3.5 కోట్లు,ఎన్సీపీ రూ.2.75 కోట్లు,శివసేన రూ.92లక్షలను గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఖర్చు చేశాయి.

అయితే టీఎంసీ గోవాలో ఖర్చు చేసిన మొత్తం.. బీజేపీ ఖర్చుతో పోలిస్తే రెండు రెట్లు అధికం. కాగా,టీఎంసీని దేశవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా గోవా ఎన్నికల్లో టీఎంసీ బరిలో దిగింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో పార్టీకి పట్టు సాధించే ప్రయత్నంలో కీలక పాత్ర పోషించారు. ప్రశాంత్ కిశోర్ టీఎంసీకి గోవాలో వ్యూహకర్తగా పనిచేశారు. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 23 స్థానాల్లో టీఎంసీ పోటీ చేయగా ఒక్క సీటు గెలవలేదు. టీఎంసీ భాగస్వామి పార్టీ అయిన ఎంజీపీ(మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ) 13 స్థానాల్లో పోటీ చేసి 2 రెండు స్థానాల్లో విజయం సాధించింది.

రాజస్తాన్ లో రాజకీయ సంక్షోభం..92మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా!

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టి ప్ర‌య‌త్నమే చేసింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆప్ గోవా ఎన్నికల బరిలో దిగడం ఇది రెండో సారి. 40 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 20 సీట్లు గెలుచుకుని ఇద్దరు ఎంజీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, ఈ నెల ప్రారంభంలో, ప్రతిపక్ష నాయకుడు మైఖేల్ లోబో, మాజీ సీఎం దిగంబర్ కామత్ సహా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bjp, Goa Assembly Elections 2022, Mamata Banerjee, TMC

ఉత్తమ కథలు