హోమ్ /వార్తలు /national /

Opinion: కాశ్మీర్‌పై మలేషియా ప్రధాని వ్యాఖ్యలు ఆ దేశానికి ఊహించని చేటు..

Opinion: కాశ్మీర్‌పై మలేషియా ప్రధాని వ్యాఖ్యలు ఆ దేశానికి ఊహించని చేటు..

జమ్మూకశ్మీర్, లద్దాఖ్ మ్యాప్

జమ్మూకశ్మీర్, లద్దాఖ్ మ్యాప్

గత నెలలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మలేషియా ప్రధానమంత్రి మహతీర్ కాశ్మీర్‌పై చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. కాశ్మీర్‌ను భారత్ ఆక్రమించి పరిపాలిస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాది భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, రెండు దేశాల వర్తకులు, దౌత్యాధిపతులలో అలజడిని సృష్టించేలా ఉన్నాయని ఐఐటీ రీసెర్చ్ స్కాలర్ వెంకట కృష్ణ తెలిపారు.

ఇంకా చదవండి ...

(వెంకట కృష్ణ, రీసెర్చ్ స్కాలర్, ఐఐటీ)

గత నెలలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మలేషియా ప్రధానమంత్రి మహతీర్ కాశ్మీర్‌పై చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. కాశ్మీర్‌ను భారత్ ఆక్రమించి పరిపాలిస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాది భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, రెండు దేశాల వర్తకులు, దౌత్యాధిపతులలో అలజడిని సృష్టించేలా ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు తనలోని సంకుచిత భావాలకు నిదర్శనంగా ఉన్నాయి. భారత్, మలేషియా చాలా కాలం నుంచి సత్సంబంధాలను కొనసాగిస్తున్నాయి. కానీ, ఈ వ్యాఖ్యలు వాటికి భంగం కలిగించేలా ఉన్నాయి. మహతీర్ ఈ వ్యాఖ్యలు చేశాక భారతీయ సమాజం సోషల్ మీడియా వేదికగామలేషియాను బహిష్కరిద్దాం అన్న నినాదంతో కోపాన్ని ప్రదర్శించింది. ఇదిలా ఉండగా, కాశ్మీర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత్ అన్ని చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే అన్ని సంస్థల కార్యకలాపాలను పునరుద్ధరించింది. గతవారం కాశ్మీర్‌లో జరిగటిన బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో 98% పోలింగ్ నమోదయింది. దీని ద్వారా మనం కాశ్మీర్‌ పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.

ఐఐటీ రీసెర్చ్ స్కాలర్ వెంకట కృష్ణ

మలేషియా సహా అన్ని దేశాలకు భారత్ మొదటి నుండి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దానికి నిదర్శనంగానే 2018లో భారత గణతంత్ర దినోత్సవానికి 10 ఆసియాన్ దేశాల ప్రతినిధులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. ఇక, భారత్, మలేషియా జీవన విధానాలు ఒకేలా ఉంటాయి. అందువల్ల పురాతన కాలం నుంచి ఇరు దేశాలు ఆచార, సంప్రదాయాలను గౌరవించుకుంటూ వస్తున్నాయి. అదీకాక.. భారత్‌కు మలేషియాతో భూభాగం, నౌకాయానం ద్వారా వాణిజ్యం సాగుతోంది. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ఇండియా శక్తివంతమైన దేశంగా ఎదగటానికి ఆసియాన్, ఐఓఆర్ఏ, అపెక్, bimstec, ఈస్ట్ ఆసియా, ఆర్‌సీఈసీ తదితర సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ సంస్థలలో మలేషియా కూడా ఒక సభ్యదేశం. అందువల్ల భారత్, మలేషియా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ దేశాన్ని చైనా అప్పుల ఊబిలోంచి కాపాడేందుకు భారత్‌తో పెట్టుబడులు, న్యాయమైన వాణిజ్య వ్యాపారాలు చేస్తేనే మేలు. మలేషియాకు ముఖ్యమైన విదేశీ పెట్టుబడిదారు. మలేషియాకు చెందిన టెక్స్‌టైల్స్, కెమికల్ ప్రొడక్ట్స్, ప్రింటింగ్ లాంటి రంగాలలో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది.

మరోవైపు, ఆసియాన్-భారత్ ఉచిత వాణిజ్య ఒప్పందం తర్వాత మలేషియా 4.4 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును భారత్ వల్లే పొందుతోంది. మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో అతి పెద్దది. అయితే, మహతీర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతిని బహిష్కరించాలని భారత వర్తకులు నిర్ణయానికి వచ్చారు. ఇవి మాత్రమే కాక.. మిగతా రంగాల్లోనూ భారత్ వల్ల ఆ దేశం లబ్ధి పొందవచ్చు. కానీ, మహతీర్ వ్యాఖ్యలు ఆ దేశ వ్యాపార రంగాన్ని దెబ్బతీసేలా తయారయ్యాయి.

First published:

Tags: Kashmir Issue, Kashmir security, Malaysia

ఉత్తమ కథలు