హోమ్ /వార్తలు /national /

జగన్ సతీమణితో మహేష్ సతీమణి నమ్రత భేటీ.. దేనిపై చర్చించారంటే..

జగన్ సతీమణితో మహేష్ సతీమణి నమ్రత భేటీ.. దేనిపై చర్చించారంటే..

వైఎస్ భారతి,నమత్ర శిరోద్కర్

వైఎస్ భారతి,నమత్ర శిరోద్కర్

భవిష్యత్‌లో ప్రభుత్వం,గ్రామం ఫౌండేషన్ రెండు కలిసి బుర్రిపాలెం అభివృద్ది కోసం పనిచేయాలని కోరుకుంటున్నట్టు నమ్రత భారతితో తెలిపారు.

  ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి,సాక్షి గ్రూప్ సంస్థల ఛైర్మన్ వైఎస్ భారతితో హీరో మహేష్ బాబు సతీమణి నమత్ర శిరోద్కర్ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలోని మహేష్ బాబు తండ్రి కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకున్న నేపథ్యంలో.. దానికి సంబంధించిన అభివృద్ది పనుల గురించి భారతితో నమత్ర చర్చించారు. భవిష్యత్‌లో ప్రభుత్వం,గ్రామం ఫౌండేషన్ రెండు కలిసి బుర్రిపాలెం అభివృద్ది కోసం పనిచేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ బాబు చేపడుతున్న స్వచ్చంద కార్యక్రమాలను వైఎస్ భారతి ప్రశంసించినట్టు సమాచారం. కాగా, భారతితో భేటీకి ముందు

  నమత్ర విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు.

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Andhra Pradesh, Ys bharathi, Ys jagan

  ఉత్తమ కథలు