Home /News /national /

POLITICS MAHARASHTRA POLITICAL CRISIS UPDATES PAWAR TO MEET CM UDDHAV AMID EKNATH REBEL STEP THE BJP HINTS TO FORM GOVT MKS

Maharashtra Crisis : గుజరాత్ క్యాంపులో 23 శివసేన ఎమ్మెల్యేలు - సర్కారు ఏర్పాటుకు బీజేపీ సిద్ధం!

బీజేపీ ఫడ్నవిస్ తో శివసేన రెబల్ ఏక్ నాథ్ షిండే, సీఎం ఠాక్రే (పాత ఫొటోలు)

బీజేపీ ఫడ్నవిస్ తో శివసేన రెబల్ ఏక్ నాథ్ షిండే, సీఎం ఠాక్రే (పాత ఫొటోలు)

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం గంటగంటకూ ముదురుతోంది. అధికార మహా వికాస్ అగాధి కూటమి ప్రభుత్వం మనుగడ ఇరకాటంలో పడేసిన శివసేన రెబల్ ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గుజరాత్ లో మకాం వేశారు. సర్కారు ఏర్పాటుకు సిద్ధమని బీజేపీ హింట్ ఇచ్చింది..

ఇంకా చదవండి ...
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం (Maharashtra political crisis) గంటగంటకూ ముదురుతోంది. అధికార మహా వికాస్ అగాధి కూటమి ప్రభుత్వం మనుగడను ఇరకాటంలో పడేస్తూ శివసేనకు చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే (Eknath Shinde)రెబల్ చర్యకు దిగారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి షిండే వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఏక్ నాథ్ షిండే వెంట ఎంత మంది ఎమ్మెల్యులు ఉన్నారనేది క్లారిటీ రావాల్సి ఉంది. షిండే వెంట 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తులుత వార్తలు వచ్చినా, ఇప్పుడా సంఖ్య 23కు పెరిగింది. కొన్ని వార్తా సంస్థలైతే షిండే వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 36గానూ పేర్కొన్నాయి. అందులో నలుగురు మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Maharashtra : భారీ షాక్ -ఉద్ధవ్ సర్కారు కూలిపోనుందా? -అజ్ఞాతంలోకి శివసేన ఎమ్మెల్యేలు


మంత్రి ఏక్ నాథ్ షిండేతోపాటు ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం గుజరాత్ లోని సూరత్ పట్టణంలో ఓ రిసార్టులో ఉన్నట్లు సమాచారం. గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోన్న క్రమంలో, సూరత్ లో శివసేన ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. షిండే వర్గంలోని 23 మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టాలనే బీజేపీ ఉద్దేశానికి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. సదరు ఎమ్మెల్యేల జాబితాతో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. బీజేపీ హైకమాండ్, అమిత్ షా, జేపీ నడ్డాలను ఆయన కలవనున్నారు. గతంలో ఓసారి ఇలాగే తొందరపడి సీఎంగా ప్రమాణం చేసి, గంటల వ్యవధిలోనే రాజీనామా చేసిన చేదు అనుభవం దరిమిలా ఫడ్నవిస్ ఈసారి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Petrol Diesel Prices : పెట్రోల్, డీజిల్‌ ధర రూ.7 పెంచిన ప్రైవేట్ సంస్థలు -భారీగా క్రూడ్ రేటు..


ఢిల్లీ వెళ్లడానికి ముందు ముంబైలో దేవేంద్ర ఫడ్నవిస్ తమతో మాట్లాడారని, శివసేనలో తిరుగుబాటు తలెత్తిన నేపథ్యంలో అవసరమైతే, మహారాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధంగా ఉంటుందని ఫడ్నవిస్ వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ మీడియా రిపోర్టు చేసింది. గుజరాత్ క్యాంపులో ఉన్న 23 మంది శివసేన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడం లేదా విశ్వాస పరీక్షకు దూరంగా ఉంచడం ద్వారా ఉద్ధవ్ సర్కారును కూలగొట్టాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే,కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలో బీజేపీ నీచ రాజకీయాలు మహారాష్ట్రలో సాగబోనీయమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. మంత్రి ఏక్ నాథ్ షిండేతో టచ్ లోనే ఉన్నామని, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేంతటి సాహసం షించే చేయబోరని, గుజరాత్ నుంచి ఆయన వర్గం ఎమ్మెల్యేలు తిరిగొస్తారనే నమ్మకం ఉందని రౌత్ మీడియాతో అన్నారు. శివసేనలో తిరుగుబాటు నేపథ్యంలో కూటమిలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం అప్రమత్తం అయ్యాయి. ఆయా పార్టీల కీలక నేతలు ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Rythu Bandhu : రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి రూ.7,700 కోట్లు రైతు బంధు.. ఎప్పుడంటే..


మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోవడంతో శివసేన పార్టీ ఇవాళ ఢిల్లీలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి వెళ్లలేకపోయింది. రౌత్ తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకొని ముంబైలోనే ఉండిపోయారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయమై ఢిల్లీలో ప్రతిపక్షాల సమావేశానికి నేతృత్వం వహిస్తోన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం ఈ సాయంత్రమే ముంబై పయనం కానున్నారు. ఇవాళ రాత్రి పవార్ ముంబై చేరగానే నేరుగా సీఎం ఠాక్రేను కలవనున్నారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఉత్కంఠభరితంగా సాగుతున్నది..

CM KCR | Centre : రూ.40వేల కోట్ల తెలంగాణ భూములు అమ్ముకోనున్న కేంద్రం: KTR ఘాటు లేఖ


మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మహా వికాస్ అగాధి కూటమికి 169 ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో శివవసేన 56, ఎన్సీపీ 53, కాంగ్రెస్ 44, బహుజన్ వికాస్ పార్టీ 3, సమాజ్ వాదీ పార్టీ 2, ప్రహార్ జనశక్తి పార్టీ 2, పీడబ్ల్యూపీకి 1 ఎమ్మెల్యే ఉండగా, 8మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు. విపక్షంలోని ఎన్డీ కూటమి బలం 113గా ఉంది. అందులో బీజేపీకి 106, ఆర్ఎస్పీ 1, జేఎస్ఎస్ 1, ఇండిపెండెంట్లు 5గురు ఉన్నారు. ఈ రెండు కూటములు కాకుండా ఎంఐఎంకు ఇద్దరు, సీపీఐ, ఎంఎన్ఎస్, స్వాభిమాన్ పక్ష్ పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. శివసేన నుంచి ప్రస్తుతం దూరమైన 23మంది ఎమ్మెల్యేలకు తోడు ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ఇంకొందరిని బయటికి లాగేసి, ఇండిపెండెంట్ల మద్దతుతో సర్కారు ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Devendra Fadnavis, Maharashtra, Sharad Pawar, Shiv Sena, Uddhav Thackeray

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు