Home /News /national /

POLITICS MAHARASHTRA POLITICAL CRISIS UPDATES CM UDDHAV MAY RESIGN SHIV SENA HINTS DISSOLVING ASSEMBLY AS 40 MLAS WITH EKNATH SHINDE AT ASSAM MKS

Maharashtra Crisis : సీఎం ఉద్ధవ్ రాజీనామా.. అసెంబ్లీ రద్దు? -రెబల్ షిండే వెంట 40 ఎమ్మెల్యేలు..

ఉద్దవ్ వెనుక షిండే (పాత ఫొటో)

ఉద్దవ్ వెనుక షిండే (పాత ఫొటో)

మహారాష్ట్ర సంక్షోభంలో బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తోన్న శివసేన అసెంబ్లీని రద్దు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాకు ముందే అసెంబ్లీని రద్దుకు మొగ్గుచూపుతున్నారని సమాచారం.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం (Maharashtra Political Crisis) అంతకంతకూ ముదిరి ముఖ్యమంత్రి రాజీనమా, అసెంబ్లీ రద్దు దిశగా వెళుతోంది. అధికార మహా వికాస్ అగాధి కూటమి సర్కారుకు షాకిస్తూ శివసేన మంత్రి ఏక్ నాథ్ షిండే ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలను వెంటేసుకొని అస్సాంలో క్యాంపె పెట్టారు. తన బలాన్ని ప్రదర్శిస్తూ ఆయన బుధవారం ఫొటోలు విడుదల చేశారు. తీవ్ర పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అదే సమయంలో అసెంబ్లీ రద్దుకు సైతం వెనుకాడబోమని సేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన హింట్ ఇచ్చారు.

షిండే వర్గం ఎమ్మెల్యేలు గుజరాత్ నుంచి తమ క్యాంపును అస్సాంకు మార్చారు. పోలీస్ భద్రత నడుమ వారు సూరత్ నుంచి గువహటి వెళ్లారు. షిండే వర్గం ఎమ్మెల్యేలు 40 మంది ప్రస్తుతం అసోం రాష్ట్ర రాజధాని గౌహతిలోని రాడిసన్ బ్లూ టల్‌లో బస చేశారు. ఫొటోను విడుదల చేయడం ద్వారా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తమ బలాన్ని చూపించారు.

మహా సంక్షోభంలో బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తోన్న శివసేన అసెంబ్లీని రద్దు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాకు ముందే అసెంబ్లీని రద్దుకు మొగ్గుచూపుతున్నారని సమాచారం. రాజీపడడం కంటే అసెంబ్లీ రద్దుకు సిద్ధమయ్యి, అధికారాన్ని త్యజించడమే ఉత్తమమని ఠాక్రే భావిస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ‘ సంక్షోభం మహారాష్ట్ర అసెంబ్లీ రద్దుకు దారితీస్తోంది’ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి అస్వస్థత.. మొహాలీ ఆస్పత్రిలో చేరిక.. పంజాబ్‌లో ఎందుకంటే..


మహారాష్ట్ర అసెం బ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 106 మంది, శివసేనకు 55, కాంగ్రెస్‌కు 44, ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీల సభ్యులు 29 మంది ఉన్నారు. ప్రస్తుతం ఎంవీఏ సర్కారుకు 152 మంది సభ్యుల బలం ఉంది. అయితే, శివసేన సీనియర్‌ నేత, మంత్రి ఏక్‌నాథ్‌ షిండే కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి సూరత్‌కు వెళ్లిపోయారు. షిండేతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి.

Viral Video : ఎయిర్ పోర్టులో కూలిన విమానం.. మంటలు..126 ప్రయాణికులు.. చివరికి..


ప్రస్తుతం మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యే మరణించడంతో అసెంబ్లీలో సంఖ్యా బలం 287గా ఉంది. అంటే విశ్వాస పరీక్ష పెడితే 144 మంది సభ్యులు ఉండాలి. తాజాగా 40 మంది సేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ఆ పార్టీ బలం 15కి పడిపోతుంది. ఫలితంగా సభలో సంకీర్ణ సర్కారు బలం 111కి తగ్గిపోతుంది. అయితే 40 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే సభలో కొత్త మెజా రిటీ మార్కు 111కి చేరుతుంది. మరోవైపు కొన్ని వార్తా సంస్థలు షిండేతో 35 మంది ఎమ్మెల్యేలున్నారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రెబెల్స్‌ సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Maharashtra, Shiv Sena, Uddhav Thackeray

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు