POLITICS MAHARASHTRA GOVT FORMATION UPDATES FLOOR TEST ON JULY 4 ELECTION OF SPEAKER A DAY EARLIER PVN
Eknath Shinde : మోదీ,షాలకు థ్యాంక్స్..నా బలం ఏంటో సోమవారం అసెంబ్లీలో చూపిస్తా!
సీఎం ఏక్ నాథ్ షిండే(ఫైల్ ఫొటో)
Eknath Shinde Floor Test : నాటకీయ పరిణామాల మధ్య గురువారం శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సోమవారం(జులై-4) అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి షిండే రెడీ అవుతున్నారు. జులై 2 నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Eknath Shinde Floor Test : నాటకీయ పరిణామాల మధ్య గురువారం శివసేన(Shiv Sena) రెబల్ నేత ఏక్నాథ్ షిండే(Eknath Shinde) మహారాష్ట్ర సీఎంగా(Maharashtra CM) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సోమవారం(జులై-4) అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి షిండే రెడీ అవుతున్నారు. జులై 2 నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సమావేశాలు ప్రారంభమైన తొలిరోజున అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. జులై 4 సోమవారం రోజు షిండే బలనిరూపణ చేసుకోకున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం లేనప్పటికీ..బలనిరూపణకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేయాలని షిండే సమావేశంలో అధికారులకు సూచించారని తెలుస్తోంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పరిపాలన అధికారులు చేయి చేయి కలిపి పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం షిండే అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం మేరకు మనం నిచేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వంటి అనుభవజ్ఞుడైన వ్యక్తి ఉండటం తన పాలనకు సహాయపడుతుందని షిండే అన్నారు. మెట్రో, సమృద్ధి ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
సీఎం ఏక్నాథ్ షిండే శుక్రవారం మాట్లాడుతూ..."శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే యొక్క శివసైనికుడు ముఖ్యమంత్రి కావడం పట్ల అసెంబ్లీలోని తన సహచరులు మాత్రమే కాకుండా మహారాష్ట్ర ప్రజలు కూడా సంతోషిస్తున్నారని అన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులకు షిండే కృతజ్ఞతలు తెలిపారు.
ఇక,సీఎంగా ఏక్ నాథ్ షిండే బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. ఈ విషయాన్ని పవార్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల సమయంలో శరద్ పవార్ సమర్పించిన అఫడవిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. గురువారం రాత్రి ఈ నోటీసులు తనకు అందాయని శరద్ పవార్ ట్విట్టర్ లో వెల్లడించారు. అయితే తన వద్ద దానికి సంబంధించిన సమాచారం అంతా ఉందని ఆయన ట్వీట్ చేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన కొద్ది గంటల్లోనే శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై విపక్షాలు విమర్శిస్తున్నాయి. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపస్ విమర్శించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.