Home /News /national /

POLITICS MAHARASHTRA CM AND SHIV SENA CHIEF UDDHAV THACKREY EMOTIONAL SPEECH AFTER SUPREME COURT JUDGEMENT ON ASSEMBLY FLOOR TEST AK

Uddhav Thackrey: నా అనుకున్న వాళ్లే నన్ను మోసం చేశారు.. సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా

ఉద్ధవ్ ఠాక్రే (ఫైల్ ఫోటో)

ఉద్ధవ్ ఠాక్రే (ఫైల్ ఫోటో)

Uddhav Thackrey: తనవాళ్లు అనుకున్న వారే తనకు నమ్మకద్రోహం చేశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. రెబల్ ఎమ్మెల్యేలకు ఏది కావాలో అది ఇచ్చానని చెప్పుకొచ్చారు.

    రేపు బలపరీక్షకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మహారాష్ట్రలో పరిణామాలు మారిపోయాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం కావడంతో ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackrey) తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. శివాజీ మహారాజ్ వారసత్వాన్ని కొనసాగిస్తామని.. బాలాసాహెబ్ ఆశయాలు నెరవేర్చామని తెలిపారు. ప్రభుత్వం నడిచేందుకు సహకరించిన సోనియాగాంధీ,(Sonia Gandhi) శరద్ పవార్‌కు(Sharad Pawar) కృతజ్ఞతలు తెలిపారు. కేబినెట్ సమావేశంలో మంత్రులతో తన ఆలోచనలను పంచుకున్నానని అన్నారు. వారిలో చాలామందిని మిస్సయ్యానని అన్నారు. తమ ప్రభుత్వానికి అదృష్టం కలిసిరాలేదని అన్నారు. గతంలోనూ శివసేన(Shiv sena) ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తామని చెప్పారు. తనవాళ్లు అనుకున్న వారే తనకు నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెబల్ ఎమ్మెల్యేలకు ఏది కావాలో అది ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఆటో రిక్షా, చేనేత బండి నడిపే వారిని ఎంపీలుగా చేశామని అన్నారు. తాను గవర్నర్‌కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని.. అయితే రెండున్నరేళ్లుగా ఆయన దగ్గర కొన్ని జాబితా పెండింగ్‌లో ఉందని అన్నారు. తిరుగుబాటు చేసిన వారందరినీ.. మీరు ఎవరితో కలత చెందుతున్నారని నేను వారిని అడగాలనుకుంటున్నానని అన్నారు.

    అయితే అంతకుముందు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రేపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కోష్యారి ఆదేశించిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వతా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు రేపు బలపరీక్ష చేపట్టాలన్ని గవర్నర్ ఆదేశాలు అమలు చేయాలని ఆదేశించింది. బలపరీక్షపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బలపరీక్షపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. దీంతో రేపు ఉదయం 11 గంటలకు బలపరీక్ష జరగడానికి లైన్ క్లియర్ అయ్యింది. అనర్హత అరోపణలు ఎదుర్కొంటున్న 16 మంది ఎమ్మెల్యేలు బలపరీక్షలో ఓటు వేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.



    అంతకుముందు సుప్రీంకోర్టులో శివసేన తరపున సింఘ్వీ, షిండే తరపున నీరత్ కృష్ణ కౌల్ ఎవరి వాదనలు వాళ్లు వినిపించారు. అసెంబ్లీలో బలపరీక్షను ఎప్పుడూ జాప్యం చేయకూడదని, రాజకీయ జవాబుదారీతనానికి, బేరసారాలు జరక్కుండా నిరోధించేందుకు బలపరీక్ష నిర్వహించడమే ఏకైక మార్గమని షిండే తరఫు న్యాయవాది కౌల్ వాదించారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం జాప్యమవుతోందన్న కారణం చూపించి బలపరీక్షను వాయిదా వేయాల్సిన అవసరం లేదని అన్నారు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత అంశం తేలాకే బలపరీక్షకు అనుమతివ్వాలని శివసేన తరపున న్యాయవాది సింఘ్వీ వాధించారు.

    క్లైమాక్స్‌కు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. మంత్రులకు థ్యాంక్స్ చెప్పిన సీఎం ఉద్ధవ్..

    BJP 2024: బీజేపీ బిగ్ ప్లాన్.. ఆ 144 సీట్లలో గెలిచేందుకు ప్రత్యేక వ్యూహం.. వీరికి బాధ్యతలు

    బలపరీక్ష గురించి తమకు ఈరోజే సమాచారం అందిందని, బలనిరూపణకు ఒకరోజు మాత్రమే ఇవ్వడం అన్యాయమని సింఘ్వీ కోర్టుకు వాదన వినిపించారు. రెబల్ ఎమ్మెల్యేలను కాపాడేందుకే తెరపైకి బలపరీక్షను తీసుకొచ్చారని, తమ ఎమ్మెల్యేలు కొంతమంది విదేశాల్లో ఉన్నారని, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని సింఘ్వీ సుప్రీంకు వివరించారు. ఈ పరిస్థితిలో బలపరీక్ష ఎలా నిర్వహిస్తారని సింఘ్వీ ప్రశ్నించారు. బలపరీక్షపై జులై 11న నిర్ణయాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టును సింఘ్వీ కోరారు. అయితే షిండే తరపు న్యాయవాది వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించడంతో.. రేపు బలపరీక్షకు లైన్ క్లియర్ అయ్యింది. అయితే బలపరీక్షకు ముందే సీఎం ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం దాదాపుగా ముగిసిపోయింది. ప్రస్తుతం మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Maharashtra, Uddhav Thackeray

    తదుపరి వార్తలు