Home /News /national /

POLITICS MAHARASHTRA BJP CHIEF APOLOGISES AFTER GO HOME COOK REMARK ON SUPRIYA SULE PVN

Supriya Sule : ఇంటికెళ్లి వంట చేసుకో వ్యాఖ్యలపై పవార్ కూతురికి బీజేపీ చీఫ్ క్షమాపణలు

ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

Maharshtra BJP Chief Sorry To Supriya Sule : రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకోపో అంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)నేత, ఎంపీ సుప్రియ సూలే(Supriya Sule)పై చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ క్షమాపణలు చెప్పారు.

ఇంకా చదవండి ...
Maharshtra BJP Chief Sorry To Supriya Sule : రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకోపో అంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)నేత, ఎంపీ సుప్రియ సూలే(Supriya Sule)పై చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ క్షమాపణలు చెప్పారు. మధ్యప్రదేశ్‌ స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు కోటా కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై సూలే ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ ఢిల్లీలోని కొందరు ముఖ్య వ్యక్తులను కలిశారని, ఇది జరిగిన రెండు రోజులకే ఓబీసీ రిజర్వేషన్‌ వచ్చిందని వ్యాఖ్యానించారు. దీని గురించి చౌహాన్‌ను అడిగినా ఆయన నుంచి సమాధానం ఏమీ లేదన్నారు. మహారాష్ట్రలోని ఓబీసీలకు సైతం విద్యా, ఉద్యోగాల్లో కోటా అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్ కొద్ది రోజులుగా నిరసన చేస్తోంది. అయితే మహారాష్ట్రలో కొనసాగుతోన్న ఈ నిరసనను మధ్యప్రదేశ్‌తో పోల్చారు సుప్రియ సూలే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ "మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి ఎవరినో కలిసి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, రెండు రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు కసరత్తు ప్రారంభమైంది" అని అన్నారు.

కాగా, సుప్రియా సూలేపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్‌ పాటిల్‌ బుధవారం జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ.."సుప్రియా సూలే ఇంకా రాజకీయాల్లో ఎందుకు ఉన్నారు? ఇంటికెళ్లి వంట చేసుకోండి. ఢిల్లీకి వెళ్తారో, శ్మశానానికి వెళ్తారో మాకు తెలియదు. మాకు ఓబీసీ కోటా కావాలి. లోక్‌సభ ఎంపీ అయిన మీకు సీఎం అపాయింట్‌మెంట్‌ కూడా ఎలా తీసుకోవాలో తెలియదా?" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ALSO READ  Hemanth soren : నేను కూాడా ఆర్యన్ ఖాన్ లాంటి బాధితుడినే

అయితే పాటిల్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా సుప్రియా సూలె భర్త సదానంద్ సూలె కూడా పాటిల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. "మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. ఎంపీ సుప్రియ గురించి మాట్లాడుతున్నారు. వారు స్త్రీద్వేషి. వీలైనప్పుడల్లా మహిళలను కించపరుస్తారు. భారతదేశంలోని అనేక మంది కష్టపడి పనిచేసే, ప్రతిభావంతులైన మహిళల్లో ఒకరిగా.. ఒక గృహిణిగా, తల్లిగా, విజయవంతమైన రాజకీయ నాయకురాలిగా ఉన్న నా భార్య గురించి నేను గర్విస్తున్నాను. ఇది మహిళలందరినీ అవమానించడమే" అని ట్వీట్ చేశారు. మరోవైపు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ పాటిల్ కు నోటీస్‌ పంపింది. దీంతో తన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు చెప్పారు. ఆదివారం తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సుప్రియాకు క్షమాపణలు చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్‌పై అసంతృప్తితో అలా అన్నానని వివరణ ఇచ్చారు. దీనిపై సుప్రియా సూలే కూడా స్పందించారు. తాను తొలి రోజు నుంచే ఆయన వ్యాఖ్యపై తిరిగి వ్యాఖ్యానించడం మానుకున్నట్లు తెలిపారు. కానీ క్షమాపణ చెప్పడం ద్వారా ఆయన తన పెద్ద మనసును చాటుకున్నారని.. ఈ విషయాన్ని ఇక్కడితో ఆపాలని ప్రతి ఒక్కరినీ నేను కోరుతున్నానని అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bjp, Maharashtra, NCP, Sharad Pawar

తదుపరి వార్తలు