హోమ్ /వార్తలు /national /

కొత్త వ్యూహాం... పోటీకి దూరంగా మహాకూటమి కీలక నేతలు

కొత్త వ్యూహాం... పోటీకి దూరంగా మహాకూటమి కీలక నేతలు

చాడ వెంకట్ రెడ్డి, కోదండరాం, రమణ

చాడ వెంకట్ రెడ్డి, కోదండరాం, రమణ

మహాకూటమిలోని ముగ్గురు కీలక నేతలు ఈ సారి పోటీకి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఎన్నికల్లో ప్రచారానికే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది.

ఇంకా చదవండి ...

  టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ భాగస్వామిగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలు కూటమిలో భాగంగా ఆశించిన స్థాయిలో సీట్లు దక్కించుకోలేకపోయాయనే ప్రచారం జరుగుతోంది. మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీకి 90కి పైగా స్థానాలు దక్కనుండగా... 14 స్థానాల్లో టీడీపీ, 7 స్థానాల్లో టీజేఎస్, 4 స్థానాల్లో సీపీఐ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. పార్టీల వారీగా వారికి దక్కనున్న సీట్ల సంగతి ఎలా ఉన్నా... ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు అనుమానంగానే కనిపిస్తోంది.

  టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ జగిత్యాలకు బదులుగా కోరుట్ల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుస్తోంది. టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారానికే ఆయన పరిమితం కానున్నారు. ఇక సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోరుతున్న హుస్నాబాద్ స్థానాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అస్సలు ముందుకు రావడం లేదు. దీంతో ఆయన కూడా పోటీలో ఉండటం దాదాపు అనుమానమే.

  ఇక టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఆయన కచ్చితంగా పోటీ చేయాల్సిందే అని టీజేఎస్ నేతలు పట్టుబడుతుంటే... ఆయన ప్రచారానికి మాత్రమే పరిమితం కావాలని కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన తాను పోటీ చేసే అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు పోటీకి దూరంగా ఉన్నా... ఆ తరువాత మహాకూటమి అధికారంలోకి వస్తే వీరికి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఓ వ్యూహాం ప్రకారమే ఈ ముగ్గురు బరిలోకి దిగకుండా కూటమి తరపున విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారనే వాదన కూడా ఉంది. ఏదేమైనా... మహాకూటమిలోని ముగ్గురు కీలక నేతలు ఎన్నికలకు దూరంగా ఉండి ప్రచారంలో దూసుకుపోతారా అన్నది వేచి చూడాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, CPI, Kodandaram, L Ramana, TDP, Telangana, Telangana Election 2018, Telangana Jana Samithi

  ఉత్తమ కథలు