తమిళనాడులో రాజకీయం మారుతోంది. అన్నాడీఎంకె టికెట్‌పై గెలిచి టీటీవి దినకరన్ వైపు వెళ్లిన 18మంది ఎమ్మెల్యేలను మద్రాస్ హైకోర్టు అనర్హులుగా ప్రకటించింది. ఈ మేరకు స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ వారి సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుతో ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 213కి పడిపోయింది.
మద్రాస్ హైకోర్టు తీర్పును దినకరన్ సుప్రీంలో సవాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో మరో ఆర్నెళ్లలో ఆయా నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే కరుణానిధితో పాటు మరో ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన స్థానాలకు కూడా ఈ ఎన్నికలతో పాటే ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఒకవేళ ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకె గనుక ఎక్కువ స్థానాలు గెలుచుకోకపోతే పళనిస్వామి ప్రభుత్వానికి మళ్లీ ముప్పు తప్పదనే చెప్పాలి. దినకరన్ లేదా డీఎంకె ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోగలిగితే తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వం మారే అవకాశాలు లేకపోలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Palanisami, Tamilnadu