హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

విపక్షాల ఐక్యతపై నీలినీడలు...కాంగ్రెస్ ఆహ్వానంపై స్పందించని మాయావతి

విపక్షాల ఐక్యతపై నీలినీడలు...కాంగ్రెస్ ఆహ్వానంపై స్పందించని మాయావతి

ఈనెల 17న జరిగే మధ్యప్రదేశ్ కొత్త సీఎం కమల్ నాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని మరోసారి విపక్షాల ఐక్యత వేదికగా మార్చాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. కమల్‌నాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్, చంద్రబాబు హాజరుకానుండగా...మాయావతి మాత్రం ఆహ్వానంపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.

ఇంకా చదవండి ...

  బెంగుళూరులో ఏడు మాసాల క్రితం జరిగిన కర్ణాటక సీఎంగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం విపక్షాల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. బీజేపీని వ్యతిరేకంచే విపక్ష నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఐక్యతను చాటారు. విపక్షాల మధ్య సఖ్యతపై ఇప్పుడు మళ్లీ నీలినీడలు నమ్ముకున్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఆ రాష్ట్ర సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఈ నెల 17న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  కమల్ నాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి పలువురు జాతీయ పార్టీల నేతలను కాంగ్రెస్ ఆహ్వానించింది. ఇప్పటి వరకు సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలిపారు. ఇంకా కేరళ సీఎం పినరయి విజయన్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, తృణాముల్ కాంగ్రెస్ సీనియర్ నేత దినేష్ త్రివేది తదితరులు కమల్ నాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. అలాగే యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

  మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారుకు మద్దతు ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతిని కూడా కమల్‌నాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్ ఆహ్వానించింది. అయితే ఆహ్వానాన్ని మన్నిస్తున్నట్లు మాయావతి దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది.

  2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో తమకు కాంగ్రెస్ కేటాయిస్తామని చెబుతున్న సీట్ల విషయంలో కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ మధ్య వివాదం నడుస్తోంది. అవసరమైతే కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఇద్దరూ కలిసి వెళ్లాలన్న యోచనలో ఎస్పీ, బీఎస్పీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికావడానికి ఒక్కరోజు దిల్లీలో జరిగిన విపక్ష నేతల సమావేశానికి మాయావతి, అఖిలేష్ యాదవ్ ఇద్దరూ డుమ్మాకొట్టారు.

  హిందీ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మూడో అతిపెద్ద రాష్ట్రం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఇక్కడ అధికార పగ్గాలు హస్తగతం చేసుకుంది. మొత్తం 230 మంది సభ్యులతో కూడిన మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ 114 స్థానాల్లో విజయం సాధించి...మ్యాజిక్ ఫిగర్(116)కి రెండు స్థానాల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే కలిగిన సమాజ్‌వాది పార్టీ, ఇద్దరు ఎమ్మెల్యేలు కలిగిన బీఎస్పీ మద్దతు ప్రకటించాయి.

  మరో నాలుగు మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ, ఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికర అంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ నుంచి 26 మంది, కాంగ్రెస్ నుంచి ముగ్గురు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొన్న వేళ మరోసారి విపక్షాల సఖ్యతను చాటేందుకు కమల్ నాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వాడుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ కార్యక్రమానికి మాయావతి గైర్హాజరైతే మాత్రం విపక్షాల ఐక్యతపై నీలిమేఘాలు కమ్ముకునే అవకాశముందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

  First published:

  Tags: Bsp, Kamal Nath, Madhya pradesh, Mayawati

  ఉత్తమ కథలు