హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

టీ అమ్మే వ్యక్తితో సీఎం ముచ్చట్లు.. 'ఏ పనీ చిన్నది కాదు.. చాయ్‌వాలా కూడా ప్రధాని కావచ్చు'

టీ అమ్మే వ్యక్తితో సీఎం ముచ్చట్లు.. 'ఏ పనీ చిన్నది కాదు.. చాయ్‌వాలా కూడా ప్రధాని కావచ్చు'

శివరాజ్ సింగ్ చౌహాన్

శివరాజ్ సింగ్ చౌహాన్

ఏ పని కూడా చిన్నది కాదని.. కష్టపడి పనిచేయాలని సూచించారు సీఎం శివరాజ్ సింగ్. మనదేశంలో టీ అమ్మే వ్యక్తి కూడా ప్రధాని కాగలడు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా భిన్నమైన వ్యక్తి. సీఎం హోదాలో ఉన్నప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటారు. అంతేకాదు ఆయన నిర్ణయాలపై గతంలో పలుమార్లు వివాదాలు కూడా చెలరేగాయి. తాజాగా మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. ఆదివారం జబల్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో శివరాజ్ సింగ్ పాల్గొన్నారు. అనంతరం నగర వీధుల్లో తిరుగుతూ స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న టీ స్టాల్ వద్దకు టీ తాగారు సీఎం. టీ కొట్టు నడుపుతున్న వ్యక్తి పేరు పప్పు గుప్తా. శివరాజ్ సింగ్ టీ తాగిన తర్వాత పప్పుతో కాసేపు ముచ్చటించారు. వ్యాపారం ఎలా సాగుతుంది? ప్రతి రోజు ఎంత డబ్బు వస్తుంది? ఎవరెవరు ఇక్కడికి వస్తారు? అని వివరాలు అడిగారు.

''సార్.. మా టీ స్టాల్ దగ్గరికి కేవలం లేబర్ మాత్రమే వస్తారు.'' అని పప్పు గుప్తా సమాధానం చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే.. ''నేను కూడా లేబర్‌నే అయ్యా''.. అని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఏ పని కూడా చిన్నది కాదని.. కష్టపడి పనిచేయాలని సూచించారు సీఎం. మనదేశంలో టీ అమ్మే వ్యక్తి కూడా ప్రధాని కాగలడు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలా పప్పు గుప్తాతో 20 నిమిషాల పాటు మాట్లాడారు శివరాజ్ సింగ్.

రెండు రోజుల పర్యటన కోసం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ జబల్‌పూర్ వచ్చారు, ఉదయంలో స్టేట్ జ్యుడిషియల్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన సీఎం హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శివరాజ్ సింగ్.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రావాల్సి ఉందని.. ఆ ఎన్నికల్లోనూ బీజేపీయే గెలుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నర్మదా నది ప్రక్షాళనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

First published:

Tags: Bjp, Madhyapradesh, Shivraj Singh Chouhan

ఉత్తమ కథలు