హోమ్ /వార్తలు /national /

మరి చేయను.. ఇదే చివరి సినిమా.. ప్రముఖ హీరో సంచలన నిర్ణయం

మరి చేయను.. ఇదే చివరి సినిమా.. ప్రముఖ హీరో సంచలన నిర్ణయం

సినిమాలకు ప్రముఖ హీరో గుడ్ బై

సినిమాలకు ప్రముఖ హీరో గుడ్ బై

ఇప్పటికే ఎమ్మెల్యేగా ఎన్నికై.. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆ హీరో.. త్వరలోనే మంత్రికూడా కాబోతున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.

సినిమా హీరోలు రాజకీయాల్లో ఇప్పటికి చాలా మంది వచ్చారు. కొందరు సక్సెస్ అయి మంచి రాజకీయ నేతలుగా పేరు తెచ్చుకున్నారు. మరికొందరు యూటర్న్ తీసుకొని.. తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోయారు. తాజాగా ఇప్పుడు ఈ తరానికి చెందిన హీరోలు కూడా సినిమాలకు గుడ్ బై చెప్పి..పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నటుడు, పోలిటీషియన్ అయిన ఉదయ నిధి స్టాలిన్(Udhayanidhi Stalin) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఇక సినిమాలు చేయనని ప్రకటించాడు. ప్రస్తుతం ఉదయ నిధి నటిస్తున్న 'మామన్నన్‌' (Maamannan Movie)చిత్రమే చివరి సినిమా అని తాజా ఇంటర్వ్యూలో ఆయన ప్రకటించారు. మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్‌ ఫజల్‌, కీర్తి సురేష్‌(Keerthi Suresh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎ ఆర్‌ రెహమాన్‌(AR Rehman) సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు ఉదయ నిధి స్టాలిన్.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) కుమారుడు అన్న విషయం తెలిసిందే. తండ్రి, తాత రాజకీయాలతో..ఉదయ నిధి కూడా రాజకీయాల్లోకి వచ్చాడు. ఇటీవలే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయ నిధి.. త్వరలో మంత్రి కూడా కాబోతున్నట్లు సమాచారం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్ – తిరువల్లికేని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఉదయ నిధి స్టాలిన్‌ విజయం సాధించారు. రానున్న రోజుల్లో జరిగే కేబినెట్ విస్తరణలో ఉదయనిధికి బెర్త్ కన్ ఫాం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరికొద్ది వారాల్లో పార్టీ యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌ను క్యాబినెట్‌లో సభ్యుడిగా నియమించనున్నట్లు డీఎంకే వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. యువ నాయకుడికి సన్నిహితంగా ఉన్న కొందరు.. ఇదే నిజమేనని చెబుతున్నారు. ఉదయనిధి ఇప్పటికే ప్రజాదరణ పొందారని, చాలా మంది మంత్రులు తమ శాఖ కార్యక్రమాలలో ఆయనతో వేదిక పంచుకోవాలని కోరుకుంటున్నారని స్టాలిన్ సన్నిహితులు చెబుతున్నారు. “కానీ ఎమ్మెల్యే మంత్రులతో వేదిక పంచుకునే ప్రోటోకాల్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో అలాంటి ప్రశ్నలకు చెక్ పెట్టేలా.. ఉదయనిధి స్టాలిన్‌ను మంత్రిగా చేస్తే.. అలాంటి సమస్యలేవి ఉండవని.. అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉదయనిధి స్టాలిన్ విషయానికి వస్తే.. రెండేళ్ల కింద‌టి నుంచే రాజ‌కీయాల్లో బిజీగా అయ్యాడు. అంత‌కుముందు వ‌ర‌కు సినిమాల‌తోనే బిజీగా ఉన్నాడు. నిర్మాత‌గా విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు. 2012లో ఓకే ఓకే సినిమాతో హీరోగా మారాడు ఉదయనిధి స్టాలిన్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ తొమ్మిదేళ్లలో 13 సినిమాలు చేశాడు. అందులో దాదాపు 7 సినిమాలు హిట్ అయ్యాయి.

First published:

Tags: Keerthi Suresh, MK Stalin, Tamil nadu Politics, Udhayanidhi Stalin

ఉత్తమ కథలు