హోమ్ /వార్తలు /national /

ఆర్టీసీ సమ్మెపై జేపీ షాకింగ్ కామెంట్స్

ఆర్టీసీ సమ్మెపై జేపీ షాకింగ్ కామెంట్స్

ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్‌కు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ మరోసారి పూర్తి మద్దతు ప్రకటించారు.

ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్‌కు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ మరోసారి పూర్తి మద్దతు ప్రకటించారు.

ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్‌కు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ మరోసారి పూర్తి మద్దతు ప్రకటించారు.

    తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఇదిలా ఉంటే హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ విజయానికి ఆర్టీసీ సమ్మెకు సంబంధం లేదని ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు వివిధ పార్టీల నాయకుల చెబుతున్నారు. కానీ ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ మాత్రం భిన్నమైన వాదన వినిపించారు. టీఆర్ఎస్‌కు వచ్చిన మెజార్టీ చిన్న విషయం కాదని ఆయన అన్నారు. ఈ ఎన్నికలను పార్టీలు, ప్రజాసంఘాలు ఆర్టీసీ సమ్మె చుట్టూనే తిప్పాయని ఆయన గుర్తు చేశారు.

    ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రైవేటు వాహనాల వినియోగం తదితర విధానపరమైన అంశాలను ప్రభుత్వానికి వదిలేసి, తమ హక్కులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వంతో చర్చల ద్వారా కార్మికులు పరిష్కరించుకోవాలన్న వాదనను ప్రజలు బలపరిచినట్టు ఆయన అభిప్రాయపడ్డారు. ఒకరకంగా ప్రభుత్వ వైఖరికి ప్రజలు గట్టి మద్దతు ప్రకటించినట్టుగా ఉందని అన్నారు. ఆర్టీసీ సమ్మెతో పాటు రోజువారీ పాలనలో గవర్నర్ జోక్యం చేసుకోవడం సరికాదని జేపీ అన్నారు. ఇటీవల ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు సరైనవి కావంటూ వ్యాఖ్యానించిన జేపీ... తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ విషయంలో పూర్తిగా మద్దతు తెలపడం విశేషం.

    First published:

    Tags: CM KCR, Rtc jac, TSRTC Strike

    ఉత్తమ కథలు