హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత మళ్లీ ఆ ఘనత మోదీదే

నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత మళ్లీ ఆ ఘనత మోదీదే

నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత మళ్లీ ఆ ఘనత మోదీదే

నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత మళ్లీ ఆ ఘనత మోదీదే

Lok Sabha Election Result 2019 | 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టికి పూర్తి మెజార్టీ తీసుకువచ్చారు. 282 స్థానాల్లో పార్టీని గెలిపించారు. ఇప్పుడూ అంతకంటే ఎక్కువ స్థానాలు బీజేపీ ఖాతాలో పడుతున్నాయి.

లోక్‌సభలో పూర్తి మెజార్టీతో వరుసగా రెండోసారి అధికారాన్ని నిలుపుకొన్న ఘనత జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత మళ్లీ మోదీకే దక్కింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 సీట్లకుగాను భారతీయ జనతా పార్టీకి 282 సీట్లు దక్కాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272 మార్క్ దాటడం ఇక లాంఛనమే. 300 పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది బీజేపీ. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన పూర్తి బలం వచ్చినట్టే. ఇలా వరుసగా రెండుసార్లు బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రావడానికి కారణం మోదీ మేనియానే. జవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత స్పష్టమైన మెజార్టీతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మోదీకే దక్కుతుంది.

1951-52 కాలంలో తొలి లోక్‌సభ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూకు నాలుగింట మూడొంతుల మెజార్టీ వచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం తర్వాత అవి తొలి ఎన్నికలు కావడంతో 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకు ఐదు నెలల పాటు దశలవారీగా పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన భారతీయ జనసంఘ్, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, సోషలిస్ట్ పార్టీ లాంటి పార్టీలు అప్పుడప్పుడే దశాదిశ ఏర్పర్చుకుంటున్నాయి. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని చూపించింది. మొత్తం 489 స్థానాలకు కాంగ్రెస్ 364 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత 1957లో 371 సీట్లు, 1962లో 494 సీట్లకు గాను 361 స్థానాల్లో పార్టీని గెలిపించారు నెహ్రూ.

1967లో కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి పడింది. 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రాభవం కాస్త తగ్గింది. 1967 లోక్‌సభ ఎన్నికల్లో నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ 520 స్థానాలకు గాను 283 స్థానాల్లో పార్టీని గెలిపించారు. ఇందిరా గాంధీకి అవి తొలి ఎన్నికలు. 1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ 'గరీబీ హఠావో' నినాదాన్ని వినిపించారు. గ్రామగ్రామాల్లో ఈ నినాదం ప్రభావం చూపించింది. దీంతో 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీకి ఏకంగా 352 స్థానాలు వచ్చాయి. రెండోసారి అధికారాన్ని చేపట్టారామె.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టినా ఎప్పుడూ స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాలనే నడిపించింది. 2014 ఎన్నికలకు ముందే మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టికి పూర్తి మెజార్టీ తీసుకువచ్చారు. 282 స్థానాల్లో పార్టీని గెలిపించారు. ఇప్పుడూ అంతకంటే ఎక్కువ స్థానాలు బీజేపీ ఖాతాలో పడుతున్నాయి.

నెహ్రూ నుంచి మోదీ వరకు... ఎవరేం చదివారో తెలుసుకోండి

ఇవి కూడా చదవండి:

Aadhaar: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...

IRCTC: రైలులో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ

PAN Card: మీ పాన్ కార్డ్ నెంబర్ అర్థమేంటో తెలుసా?

First published:

Tags: Indira Gandhi, Lok Sabha Elections 2019, Narendra modi, Pm modi

ఉత్తమ కథలు